వామ్మో… ఏం జరుగుతోంది సినిమా పరిశ్రమలో..? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు నిజంగా హీట్ క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా సురేందర్ రెడ్డి – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ గురించి వస్తున్న రూమర్స్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని రేపుతున్నాయి.ఇప్పటికే ఓజి తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్, ప్రస్తుతం రాజకీయాల ల్లో బిజీ బిజీగా మారిపోయారు. ఒక వైపు పాలిటిక్స్‌లో నాన్-స్టాప్ మీటింగ్స్… మరో వైపు తను నటించిన సినిమాల విడుదలలు వరుసగా సిద్ధమవుతుండటంతో ఆయన పేరు ప్రతిరోజూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం, సినిమాలు, రాజకీయాలు — అన్నీ కలిపి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది.


ఇలాంటి సమయంలోనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ కొత్త సినిమాకు అంగీకరించాడట అనే న్యూస్ ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది. ఆఫీషియల్ ప్రకటన వెలువడకపోయినా, ఇన్‌సైడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ నిజంగానే జరుగుతుందని టాక్ గట్టిగానే వినిపిస్తోంది.సురేందర్ రెడ్డి ప్లాన్ చేస్తున్న సినిమా పూర్తిగా స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అంటూ తెలుస్తుంది. పవన్ కళ్యాణ్‌ను అభిమానులు ఇంతకు ముందు ఎప్పుడూ చూడని రేర్ స్టైల్లో ప్రెజెంట్ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారని చెప్పుకుంటున్నారు. లుక్ నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు అన్నీ టాప్–నాచ్‌గా ఉండేలా సురేందర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టుతున్నారట.



అయితే ఈ ప్రాజెక్ట్‌లో ఇంకా పెద్ద హైలైట్ ఏంటంటే… హీరోయిన్‌గా సాయి పల్లవి ఫైనల్ అయ్యిందట అనే వార్త. సాధారణంగా సాయి పల్లవి స్క్రిప్ట్‌కి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కథలో కంటెంట్ బలంగా లేకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్నా కూడా వెంటనే ఓకే చెప్పరు. అంత స్ట్రాంగ్ సెలెక్షన్ సెన్స్ ఉన్న ఆమె ఈ కథ వినగానే పవన్ కళ్యాణ్ పక్కన నటించేందుకు వెంటనే అంగీకరించిందంటే… స్క్రిప్ట్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సాయి పల్లవికి ఇచ్చిన పాత్ర చాలా హార్ట్ టచింగ్, భావోద్వేగాలతో నిండినది అని సమాచారం. సినిమాలో ఆమె రోల్ మహిళలకు ప్రత్యేకంగా కనెక్ట్ అయ్యేలా ఉంటుందని, అది సినిమా మొత్తానికి ఒక ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఇస్తుందని ఇన్‌సైడ్ టాక్.



పవర్ స్టార్–సాయి పల్లవి కాంబినేషన్ స్క్రీన్‌పై ఎలా ఉంటుందా అని అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురు చూశారు. ఇప్పుడా కలయిక నిజం కాబోతోందనే వార్త స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి అభిమానుల ఆ కోరికను నెరవేర్చబోతున్నాడనే భావనను మరింత బలపరుస్తోంది.ఇక ఈ ప్రాజెక్ట్‌పై వచ్చే రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడితే… అది పవన్ కళ్యాణ్ అభిమానుల్లో చెప్పలేనంత భారీ హంగామా రేపడం ఖాయం. సురేందర్ రెడ్డి స్టైల్, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, సాయి పల్లవి ఎమోషనల్ పెర్ఫార్మెన్స్—అన్ని  కలిసి ఈ సినిమా ఇండస్ట్రీలో పెద్ద హైప్ క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్లుగానే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: