2011లో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ సన్నీలియోన్ తో మొదలై.. 2014లో కేన్సులో సైతం చర్చనీయాంశంగా మారిన చిత్రం రాగిణి ఎంఎంఎస్. ఈసారి  మూడో భాగంతో సరికొత్త కథాంశంతో భారీ బడ్జెట్ తో మళ్లీ భయపెట్టడానికి సిద్ధమవుతున్నారు చిత్ర బృందం. అయితే ఇందులో హీరోయిన్ ఎవరు అనే విషయంపై ఇప్పుడు బాలీవుడ్ లో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో బోల్డ్ బ్యూటిఫుల్ రోల్ కోసం టాలీవుడ్ టాప్ హీరోయిన్ కి అడ్వాన్స్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.



హీరోయిన్ ఎవరో కాదు తమన్నా. గడచిన రెండేళ్లలో తమన్నా తన ఇమేజ్ ను సైతం మార్చేసుకుంది. అడల్ట్ కంటెంట్, పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది. దీంతో పాన్ ఇండియా లెవెల్లో తమన్నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. టాలీవుడ్,  బాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషలలో కూడా తమన్నాకు భారీగానే క్రేజ్ ఉండడంతో.. ఇప్పుడు రాగిణి ఎంఎంఎస్-3 కోసం చర్చలు జరపగా తమన్నా కూడా సుముఖంగానే ఉందనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటన అయితే రాలేదు. కానీ చర్చలు మాత్రం పాజిటివ్ గానే ఉన్నట్లు వినిపిస్తున్నాయి.


పైగా ఏక్తా కపూర్ ఈ ప్రాజెక్టుని థియేటర్లోకి తీసుకువెళ్లాలనే ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ ఈ సినిమాకి తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం తమన్నా కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ రిస్క్ చిత్రంగా నిలుస్తుంది. సాధారణంగా  తమన్నా అందం , అభినయంతో పాటు డాన్స్ తో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు 80కి పైగా  సినిమాలలో నటించిన తమన్నా తన స్పెషల్ సాంగులతో భారీ రికార్డులను సైతం సృష్టించింది. మరి రాగిణి ఎంఎంఎస్ 2 లో బోల్డ్ బ్యూటీగా పేరుపొందిన సన్నీలియోన్ రెచ్చిపోయి మరీ నటించింది..మరి అలాంటి సన్నీలియోన్ ని డామినేట్ చేసేలా తమన్నా ఎలా మెప్పిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: