ఒక్క దేశం.. ఓకే రోజు ..930 కోట్లకి పైగా గ్రాస్.. బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న లేటెస్ట్ సినిమా ఇదే..!
ఈ ఏడాదిలోనే చైనాకు చెందిన ‘నే జాహ్’ అనే యానిమేషన్ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 2 బిలియన్ డాలర్లకుపైగా గ్రాస్ సాధించడం సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని సంచలనానికి గురిచేసింది. ఇది ‘అవతార్ 2’ లాంటి హాలీవుడ్ మెగాబ్లాక్‌బస్టర్ల రేంజ్ వసూళ్లే. ఒక యానిమేషన్ సినిమా ఇలా వసూళ్లు చేయడం అనేది ఎంతటి ప్రభావం యానిమేషన్ సినిమాలకు ఉందో స్పష్టంగా చెబుతోంది.ఇక ఇదే తరహాలో మరో యానిమేషన్ చిత్రం ప్రస్తుతం వరల్డ్ బాక్సాఫీస్‌ను వణికిస్తుంది. ఆ సినిమా హాలీవుడ్ డిస్నీకి చెందిన ‘జూటోపియా 2’.అంచనా దాటి, ఊహించనంతగా, ఈ సినిమా కేవలం చైనా మార్కెట్‌లో ఒక్కరోజులోనే 104 మిలియన్ డాలర్లకుపైగా వసూళ్లు రాబట్టినట్టు సమాచారం. ఇది మన భారతీయ కరెన్సీలో చూస్తే దాదాపు ₹930 కోట్లకు పైగా అవుతుంది.
ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే—ఈ ఒక్కరోజు వసూళ్లతోనే ‘జూటోపియా 2’ చైనాలో ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ డే 1 రికార్డును దాటేసిందట. అంటే ఒక యానిమేషన్ సినిమా ప్రపంచంలోనే అత్యంత భారీ ఓపెనింగ్స్ అందుకున్న చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది. డిస్నీ కంపెనీ, దర్శకులు జెరెడ్ బుష్ మరియు బైరన్ హోవార్డ్ ఈ సీక్వెల్‌ను అపూర్వమైన విజువల్స్, కొత్త కథనాలతో తీసుకువచ్చారు.ప్రస్తుతం ఈ సినిమా వసూళ్లు ప్రారంభంలోనే ఇంత భారీ స్థాయిలో ఉండటంతో, దీని లాంగ్ రన్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి గ్లోబల్ మార్కెట్లలో చాలా ఎక్కువగా పెరిగింది. ఇంకా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో, ఎలాంటి ఆల్‌టైమ్ రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి