కొంతమంది సెలబ్రిటీలు అప్పుడప్పుడు చేసే కామెంట్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. అలా తాజాగా సినీ నటుడు శివాజీ రాజా చేసిన కామెంట్లు నెట్టింట్లో దుమారం సృష్టిస్తున్నాయి. తెలుగు వాళ్ళు ఎక్కడ అడుగుపెడితే అక్కడ నాశనమే అంటూ ఆయన చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.మరి ఇంతకీ అరుణాచల ఆలయ ప్రతిష్ట విషయంలో శివాజీ రాజా ఎందుకు ఈ మాటలు మాట్లాడారు.. ఎందుకు తెలుగువారిని ఉద్దేశించి ఈ కామెంట్ చేశారు అనేది ఇప్పుడు చూద్దాం.. అరుణాచల ఆలయం.. తమిళనాడులో ఉన్న దీన్ని ఎంతోమంది హిందువులు పవిత్రంగా భావిస్తారు. అరుణాచల గిరిప్రదక్షిణలు చేయడం, అరుణాచల స్వామివారిని దర్శించుకోవడం,రమణ మహర్షి ఆశ్రమాన్ని సందర్శించడం ఇలా ఎన్నో ఉంటాయి. అయితే ఎప్పుడైతే చాగంటి అరుణాచల ఆలయ ప్రతిష్ట గురించి చెప్పారో అప్పటినుండి చాలామంది తెలుగు వాళ్ళు అరుణాచలం వెళుతూ ఉన్నారు. 

అయితే భక్తితో వెళితే ఏమీ కాదు. కొంతమంది అది ఎలా ఉంటుంది అని వెకేషన్ ట్రిప్ లాగా వెళ్లి వస్తూ ఉన్నారు. అంతేకాదు అక్కడ గిరి ప్రదక్షిణలు చేస్తూ ఫోటోలు,వీడియోలు తీసుకోవడం ఇలా ఎన్నో జరుగుతున్నాయి.ఇలా చేయడం వల్ల అక్కడ భక్తులకు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. దీని గురించి శివాజీ రాజా మాట్లాడుతూ.. తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ నాశనమే.అయితే అందరూ అలా ఉండరు. అరుణాచలానికి వెళ్లే 100% మందిలో 75% మంది భక్తితో వెళితే మిగతా 25 శాతం మంది ఏదో వెకేషన్ ట్రిప్ లాగా వెళుతున్నారు. వీళ్ళు చేసే పనుల వల్ల అక్కడి వాళ్ళు మండిపడుతూ తెలుగు వారెందుకు ఇక్కడికి వస్తున్నారని తిడుతున్నారు. రమణ మహర్షి ఆశ్రమం చాలా ప్రశాంతంగా ఉండేది. కానీ అక్కడికి తరచూ నేను,రాజా రవీంద్ర వెళ్తూ ఉంటాం.

అలా వెళ్ళినప్పుడు ఒక సెల్ఫీ అంటూ ఎంతోమంది అక్కడికి వచ్చిన తెలుగు వాళ్ళు అరిచారు.అలా అరవడం వల్ల అక్కడ ఉన్న భక్తులకు డిస్టర్బెన్స్ అయ్యింది.తెలుగు వాళ్ళు పూజిస్తారు భక్తి ఉంటుంది కానీ కాస్త అతి చేస్తారు.అయితే అందరూ అలా ఉండరు. 100 శాతం మందిలో ఉంటే 25 శాతం మంది ఇలా ఉండి వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ నాశనం అవుతుంది. రమణ మహర్షి ఆశ్రమానికి ఇళయరాజా, వెంకటేష్ తరచూ వెళ్తూ ఉంటారు. ఇలా కొంతమంది ఫోటోలు వీడియోలు తీసుకుంటూ భక్తులకు డిస్టబెన్స్ చేయడం వల్ల తమిళ వాళ్లు తెలుగు వాళ్ళు ఇక్కడికి రాకూడదని మండిపడుతున్నారు అంటూ శివాజీ రాజా  భక్తితో కాకుండా కేవలం వెకేషన్ ట్రిప్ కోసం అది ఎలా ఉంటుందో చూడ కోసం వెళ్లే వారిపై ఫైర్ అవుతూ తాజా ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్లు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: