ఆంధ్ర కింగ్ తాలూకా..రామ్ పోతినేని, ఉపేంద్ర,భాగ్యశ్రీ బోర్సే కాంబోలో వచ్చిన ఈ సినిమాలో ఉపేంద్ర ఆంధ్ర కింగ్ గా నటించగా.. ఉపేంద్ర వీరాభిమానిగా రామ్ పోతినేని నటించారు.అయితే ఈ సినిమా ఫ్యాన్ బేస్డ్ పర్ఫెక్ట్ కథ కావడంతో మిగతా హీరోల అభిమానులకు కూడా చాలా కనెక్ట్ అయింది. ఒక హీరో మీద ఉన్న అభిమానంతో అభిమానులు వారి అభిమానాన్ని ఏ విధంగా బయటపెడుతూ ఉంటారు అనేది ఈ సినిమాలో చాలా క్లియర్ గా చూపించారు దర్శకుడు పి.మహేష్ బాబు..అయితే ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.. ఈ సినిమాలో చూపించిన చాలావరకు సన్నివేశాలు రియల్ గా జరిగినవే.. ఎవరో ఒక హీరో విషయంలో అభిమానులు చేసిన పనులే.. ముఖ్యంగా ఈ సినిమాలో అరటి పళ్ళు కథ తన రియల్ లైఫ్ లోదే పెట్టుకున్నారట దర్శకుడు పి. మహేష్ బాబు.

ఆయన తన జీవితంలో జరిగిన ఒక సంఘటనని ఈ సినిమాలో పెట్టారు. అదేంటంటే రామ్ పోతినేని ఉపేంద్ర కి అరటి పళ్ళు ఇష్టమని తెలిసి తీసుకు వెళ్లే సీన్ ఒకటి ఉంటుంది.అయితే ఈ సీన్ మహేష్ బాబు తన రియల్ లైఫ్ లో జరిగింది అని తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీ కోసం క్యాంపేనింగ్ చేస్తున్న సమయంలో జరిగిన ఓ స్టోరీ అట. పవన్ కళ్యాణ్ కి అరటి పళ్లు అంటే ఇష్టమని తెలుసుకున్న డైరెక్టర్ మహేష్ బాబు రాత్రి భోజనం చేసే సమయంలో వేళ కాని వేళ అతి కష్టం మీద తీసుకువెళ్లి పవన్ కళ్యాణ్ కి ఇచ్చారట. 

ఇక ఇదే సీన్ ని మహేష్ బాబు ఈ సినిమాలో పెట్టారు. ఇందులో రామ్ పోతినేని ఊరికి దగ్గరలో ఉపేంద్ర సినిమా షూటింగ్ జరుగుతుంది అని రామ్ తెలుసుకుంటారు. ఆ సమయంలో ఉపేంద్రకి అరటిపళ్ళు అంటే ఇష్టమని తెలుసుకొని అతి కష్టం మీద ఎన్నో అడ్డంకులు దాటుకొని అరటి పళ్ళు తీసుకువెళ్తాడు.కానీ ఆ సమయంలో షూటింగ్ కంప్లీట్ అయి సెట్లో కేవలం నిర్మాత మాత్రమే ఉంటారు. ఆ తర్వాత మరో రోజు కూడా అలాగే జరగడంతో రామ్ పోతినేని వెళ్లి ప్రొడ్యూసర్ కి అరటిపళ్ళు ఇచ్చి వస్తారు.అలా ఈ సీన్ తన రియల్ లైఫ్ లో పవన్ కళ్యాణ్ విషయంలో జరిగింది అని దర్శకుడు పి. మహేష్ బాబు తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: