కోలీవుడ్ నటుడు కమల్ హాసన్ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నటుడు విజయ్ గురించి కమల్ హాసన్ చేసిన కామెంట్లు చర్చనీయాంశమయ్యాయి.

విజయ్‌కు సలహా ఇచ్చే స్థితిలో తాను లేనని కమల్ హాసన్ స్పష్టం చేశారు. "బ్రదర్ లాంటి విజయ్ కు సలహా ఇవ్వడానికి ఇది సరైన సమయం కాదని నేను అనుకుంటున్నాను" అని ఆయన పేర్కొన్నారు.

అనుభవం గురించి మాట్లాడుతూ కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనుభవం మనకంటే గొప్ప గురువు అని, అది నేర్పే పాఠాలు మరెవరూ నేర్పించలేరని ఆయన చెప్పారు. "మనుషులకు పక్షపాతం ఉండొచ్చు కానీ అనుభవానికి ఉండదు" అని కమల్ హాసన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయనున్న విజయ్‌కు సలహాలు ఇస్తున్నారా అనే ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు. విజయ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

మరోవైపు, నటుడు విజయ్ ప్రస్తుతం 'జన నాయగన్' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రం 'భగవంత్ కేసరి' సినిమాకు రీమేక్ అని తెలుస్తోంది. అంతేకాకుండా, విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ తరఫున ఆయనే సీఎం అభ్యర్థి అని ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించింది. జన నాయగన్  సినిమాతో విజయ్ ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: