శివాజీ రాజా మాట్లాడుతూ.." మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన సమయంలో నాగబాబు, నేను దూరమయ్యాము. చాలా కష్టపడి ఎంతో జెన్యూన్ గా ఉన్నప్పటికీ చిన్న చిన్న వాటి వల్ల విడిపోయాము..నేనేంటో అందరికీ బాగా తెలుసు.. సినీ ఇండస్ట్రీలో అందరూ బ్రతకాలి అని కోరుకునే వారిలో నేను ముందు వరసలో ఉంటాను. మా లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల నాగబాబుతో విభేదాలు మొదలయ్యాయని" తెలిపారు. నాగబాబు తనకి బాగా క్లోజ్ అని, ఆయనతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్లి మరీ భోజనం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అని, నాగబాబు తనకు స్నేహితుడు మాత్రమే కాదు సోదరుడు కంటే ఎక్కువ అంటూ తెలిపారు శివాజీ రాజా.
ఇక అంతకంటే ఎక్కువగా ఈ విషయం గురించి తాను చెప్పలేనని ఒకవేళ ఇంకా మాట్లాడితే నాకు గుండెల్లో బాధగా అనిపిస్తుంది అంటూ తెలిపారు శివాజీ రాజా. మేమిద్దరం ఇండస్ట్రీలో కలవాలని చాలామంది కోరుకుంటున్నారు త్వరలోనే వారందరి కోరిక కూడా తీరుస్తానని, నాగబాబు దగ్గరికి వెళ్లి మరి హగ్ ఇచ్చి అన్నిటికీ పుల్ స్టాప్ పెడతానంటూ తెలిపారు శివాజీ రాజా. ఈ విషయంపై తనను నాగబాబు తిట్టినా.. ఏమనుకున్న పరవాలేదు అంటూ తెలియజేశారు. శివాజీ రాజా ఒకప్పుడు కమెడియన్ గానే కాకుండా పలు చిత్రాలలో విలన్ గా కూడా నటించి మంచి పేరు సంపాదించారు. అలాగే అమృతం సీరియల్ లో కూడా తన అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి