ఇప్పటిదాకా సమంత–రాజ్ నిడమోరి రిలేషన్ గురించి "డేటింగ్‌లో ఉన్నారు". "మరికొంత కాలంలో పెళ్లి చేసుకోబోతున్నారు" వంటి వార్తలు అప్పుడప్పుడూ బయటికొచ్చాయి. అయితే ఎందుకు ప్రత్యేకంగా డిసెంబర్ 1నే పెళ్లి చేసుకున్నారు? అన్న ప్రశ్న మాత్రం ప్రస్తుతం పెద్ద చర్చగా మారింది. ఈ తేదీని చూసి పెళ్లి కావడం వెనుక ఏదైనా వ్యక్తిగత కారణం ఉందా? లేక పూజా, శుభముహూర్తం, ఆధ్యాత్మిక కారణం ఏదైనా ఉందా? అన్నది స్పష్టతకు రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయంపై ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి.
కొంతమంది సోషల్ మీడియాలో దీనిని రాధాంతం చేస్తూ, డిసెంబర్ 4న నాగచైతన్య సమంత మెడలో మూడు ముళ్లు వేసి అధికారికంగా తన భార్యగా పరిచయం చేసిన రోజు కాబట్టి, సరిగ్గా ఆ తేదీకి మూడు రోజుల ముందే సమంత రెండో పెళ్లి చేసుకుని రివెంజ్ తీర్చుకున్నట్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ తీర్మానాలనే ఆధారంగా కొన్ని అకౌంట్లు ఘాటుగా రియాక్ట్ అవుతూ పోస్ట్‌లు చేస్తుండగా, మరోవైపు సమంత అభిమానులు మాత్రం దీనికి కఠినంగా స్పందిస్తున్నారు. వారి మాట ఏమిటంటే—“ఇది వారి పర్సనల్ లైఫ్… వారి ఇష్టం. ఎవరిదైనా వ్యక్తిగత నిర్ణయాన్ని రివెంజ్‌తో లింక్ చేయడం అనవసరం.”సమంత–రాజ్ నిడమోరు పెళ్లి పిక్చర్స్ వెరైటీ రిచువల్స్, ఆధ్యాత్మిక నేపథ్యం, సింపుల్ కానీ క్లాసీ వేడుక కారణంగా సోషల్ మీడియా మొత్తం మీద వైరల్ అవుతూ ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్‌బుక్ ఎక్కడ చూసినా ఈ పెళ్లి ఫోటోలకే డిమాండ్ పెరిగిపోయింది.
ఇక వీరి పెళ్లి వార్తను స్పెషల్‌గా మార్చేసిందేమిటంటే— సమంత గత కొన్నేళ్లుగా ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించడంతో ఆమె అభిమానులు కూడా హ్యాపీగా స్పందిస్తున్నారు.ఇలా సమంత రెండో పెళ్లి టాలీవుడ్, సోషల్ మీడియా, అభిమానుల మధ్య బిగ్ టాపిక్‌గా నిలుస్తోంది. మరి ఈ కొత్త జంట జీవితంలో కొత్త అధ్యాయం ఎలా ఉండబోతోందో చూడాలి..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి