టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ నిర్మాతగా పేరు సంపాదించిన దిల్ రాజు గురించి  ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.. ముఖ్యంగా కొత్త నటీనటులను, డైరెక్టర్లను ఎంకరేజ్ చేయడంలో ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడు బాలీవుడ్ పైన దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన బాలీవుడ్లో అగ్ర హీరోలతో వరుస ప్రాజెక్టులు చేసేందుకు సిద్ధమయ్యానని స్వయంగా దిల్ రాజు ఈ విషయాలను వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి తమ SVC సంస్థ నుంచి మొత్తం ఆరు సినిమాలు  విడుదల కాబోతున్నాయంటూ దిల్ రాజు తెలియజేశారు.


ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాని బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, అనీస్ బాజ్మీ హిందీలో నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని 2026 లో షూటింగ్ మొదలుపెట్టి అదే ఏడాది విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఆ తర్వాత సల్మాన్ ఖాన్, డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ఒక భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించబోతున్నామని తెలిపారు. కీర్తి సురేష్ , విజయ్ దేవరకొండ జంటగా రౌడీ జనార్దన్ సినిమాని కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు.


అలాగే హర్షిత రెడ్డి తోనూ ఒక బడా ప్రాజెక్ట్ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా మరో రెండు మూడు చిత్రాలు ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయట. అలాగే హీరో పవన్ కళ్యాణ్ తో కూడా సినిమా చేయబోతున్నట్లు దిల్ రాజు సోదరుడు శిరీష్ ఇదివరకే ప్రకటించారు. మొత్తానికి దిల్ రాజు తో పాటు అతని సోదరుడు సిరీస్ తమ సంస్థ నుంచి వచ్చే ఏడాది ఆరు సినిమాలను విడుదల చేస్తామంటూ తెలియజేశారు. మరి ఈ ఏడాది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలకు మిశ్రమ స్పందన లభించింది. మరి వచ్చే ఏడాది అయినా తమ సినిమాలతో సత్తా చాటుతారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: