స్టార్ హీరోయిన్ సమంత రూతు ప్రభు రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. దర్శకుడు రాజ్ నిడమూరితో ఆమె వివాహం జరిగినట్లు అధికారికంగా వెల్లడించిన క్షణం నుంచి సోషల్ మీడియాలో ఊహాగానాలు, చర్చలు, పోలికలు మరింత వేగంగా పెరిగాయి. సమంత మొదటి వివాహం నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఆమె వ్యక్తిగత జీవితం ఎలా ఉండబోతోంది, కొత్త జీవితం ఎంతవరకు సక్సెస్ అవుతుందనేదానిపై అభిమానులు, నెటిజన్లు ఇప్పుడు పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రముఖ జ్యోతిష్కుడు ప్రశాంత్ కినీ చేసిన పాత ప్రవచనం మరోసారి వైరల్ అవుతోంది. తాను 2023లో చేసిన జోస్యంలో సమంత భవిష్యత్తు గురించి చెప్పిన ప్రతిదీ నిజమైందని ఆయన తాజాగా పేర్కొంటూ ఒక కొత్త పోస్ట్ పెట్టారు.



ప్రశాంత్ కినీ మాటల్లో—“2024లో సమంత మళ్లీ ప్రేమలో పడుతుంది” అని తాను అప్పుడే చెప్పా. అలాగే “2025లో ఆమె రెండో వివాహం జరగడం ఖాయం” అని చేసిన ప్రవచనం ఇప్పుడు నిజమైందని అన్నారు. అంతేకాదు, 2026 తర్వాత సమంత తన భర్తతో కలిసి అమెరికాకు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది అని కూడా ఆయన చెప్పారట. అయితే ఇంతటితో ఆగలేదు. సమంత రెండో పెళ్లిపై ఆయన మరికొన్ని వ్యక్తిగత వివరాలు కూడా చెప్పాడు. తన జ్యోతిష్య ప్రకారం— ఈ రెండో వివాహం చాలా స్థిరంగా, సంతోషంగా, దీర్ఘకాలం విజయవంతంగా కొనసాగుతుంది, సమంత తన జీవితాంతం రాజ్ నిడమూరితోనే సుఖంగా ఉంటుందని చెప్పారు.



జ్యోతిష్కుడి ఈ మాటలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో రెండు విధాల స్పందనలు కనిపిస్తున్నాయి. కొందరు నెగిటివ్ గా స్పందిస్తుంటే మరికొందరు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. కొంత మంది అయితే జ్యోతిష్కుడి ప్రవచనాలు సరైందని అంటుండగా, మరికొందరు ఇవి హైప్ క్రియేట్ చేసేందుకు చెప్పినవేనని కామెంట్ చేస్తున్నారు. కాగా సమంత రెండో పెళ్లితో పాటు, ఆమె పాత జీవితం, వ్యక్తిగత నిర్ణయాలు, భవిష్యత్తు ప్రణాళికలపై కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సమంత మాత్రం ప్రస్తుతం తన కొత్త జీవితాన్ని ప్రశాంతంగా ప్రారంభించిందని, వ్యక్తిగత విషయాలపై అనవసర చర్చలు ఆపాలని కోరుకుంటున్నారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ జ్యోతిష్య ప్రవచనం హాట్ టాపిక్‌గా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: