భూత శుద్ధి వివాహ పద్ధతి ఏ ఒక్క కులానికి, మతానికి, సంప్రదాయానికి మాత్రమే పరిమితం కాదు. ముఖ్యంగా లింగ భైరవి దేవి భక్తులు, ఈషా ఫౌండేషన్ అనుచరులు ఈ విధానాన్ని ఎక్కువగా అనుసరిస్తారు. ఎందుకంటే, ఈ పద్ధతి ద్వారా మునుపటి జన్మలలో చేసిన కర్మలు సుద్ధి అవుతాయి, ఆత్మ మరింత ప్రశాంతమవుతుందని భావిస్తారు. ఈ కారణంగానే సమంత–రాజ్ నిడమోరు తమ జీవితపు కొత్త ప్రయాణాన్ని ఈ పవిత్రమైన భూత శుద్ధి వివాహంతో ప్రారంభించారు.
కేవలం సమంత–రాజ్ జంట మాత్రమే కాదు, ఈ పద్ధతిలో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు మరెందరో ఉన్నారు. బాలీవుడ్ బుల్లితెర జంట వరుణ్ జైన్–గియో మానిక్ కూడా ఇదే భూత శుద్ధి విధానంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అలాగే టాలీవుడ్ నుంచి కూడా ఒక యువ హీరో ఈ పద్ధతినే ఎంచుకున్నట్లు సమాచారం. అతడే అంకిత్ కొయ్య. ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ సినిమాలో రావు రమేష్ కొడుకుగా నటించి మంచి గుర్తింపు పొందిన అంకిత్, అంతకుముందు యూట్యూబ్ వెబ్ సిరీస్‌లు, ప్రైవేట్ ఆల్బమ్‌ల ద్వారా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించాడు. ఆశ్చర్యం ఏంటంటే అతగాడికి కూడా ఇది రెండో పెళ్లినే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అతనికీ ఇది రెండో పెళ్లే అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. భూత శుద్ధి అనే ఈ ఆధ్యాత్మిక పద్ధతి, సినీ ప్రముఖులు వరుసగా దీన్ని ఎంచుకోవడం వల్ల మరింతగా ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. శరీరం–మనసు–ఆత్మలు శుద్ధి అవుతాయన్న నమ్మకం, భవిష్యత్తు జీవితానికి శుభప్రదంగా ఉంటుందన్న విశ్వాసమే చాలామంది ఈ పద్ధతిని స్వీకరించడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి