ఈ నేపథ్యంలో నెటిజన్స్ రీ-ఎక్స్‌ప్లోర్ చేస్తున్న సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్‌బాబు నటించిన `అతడు`. ముఖ్యంగా ఈ సినిమాలోని ఒక ఐకానిక్ యాక్షన్ సీన్ ఇప్పుడు పెద్ద వివాదానికి కారణమవుతోంది. కాంట్రాక్ట్ కిల్లర్ నందగోపాల్ పోలీసుల ముట్టడిలో చిక్కుకొని తాడు పట్టుకుని బిల్డింగ్ నుంచి రైలు మీదికి దూకే సీన్ అప్పట్లో ప్రేక్షకులను అబ్బురపరిచింది. గురూజీ క్రియేటివిటీ అంటూ అభిమానులు మంత్రముగ్ధులు అయ్యారు.
కానీ ఈ సీన్ త్రివిక్రమ్ క్రియేటివిటీ కాదు… కాపీ అని నెటిజన్స్ తాజాగా ఆధారాలతో చెబుతున్నారు. 1998లో వచ్చిన హాలీవుడ్ మూవీ `యూఎస్ మార్షల్స్`లో కూడా ఇలాంటి సన్నివేశమొకటి ఉంది. అదే బిల్డింగ్, అదే రైల్వే స్టేషన్ వైబ్, అలాగే హీరో తాడు సహాయంతో రైలు మీదికి జంప్ అయ్యే సీక్వెన్స్… ఇది చూసిన నెటిజన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అతడు సీన్‌తో ఫ్రేమ్ టు ఫ్రేమ్ మ్యాచ్ అవ్వడంతో ఇంత మోసం ఏంటయ్యా గురూజీ అంటూ నెటిజన్లు తల పట్టుకుంటున్నారు. ఇంటర్నెట్ లేని కాలంలో వచ్చిన పాత హాలీవుడ్ సినిమాను ఎవరూ గుర్తు పట్టరని అనుకుని త్రివిక్రమ్ వాడేసుంటాడని సెటైర్లు పేలుస్తున్నారు.
ఇదొక్కటే కాదు… `అజ్ఞాతవాసి`, `అల వైకుంఠపురములో`, `జులాయి` వంటి మరికొన్ని సినిమాల్లో కూడా హాలీవుడ్ రిఫరెన్స్‌లు ఉన్నాయని నెటిజన్స్ స్క్రీన్ షాట్లతో రుజువు చేస్తున్నారు. క్రియేటివిటీ కింగ్ కాదు.. కాపీ కింగ్ అంటూ ఫ్రేమ్‌లను మిక్స్ చేసి, ఫోటోలను కలిపి, డైరెక్ట్ కాంపారిజన్ చేస్తూ రీల్స్, మీమ్స్ తో వరుస పెట్టి గురూజీపై కాపీ యాక్యూసేషన్స్ ను కురిపిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి