యంగ్ రెబల్ స్టార్  ప్రభాస్ హీరోగా నటించిన  ‘సాహో’చిత్రానికి తెలంగాణ సర్కార్ నుంచి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది .  యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం, ఈ నెల 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది .  భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్లను  ఫస్ట్ వీక్ లోనే రాబట్టుకునేందుకు, టికెట్ల ధరల పెంపు తో పాటు ,  స్పెషల్ బెనిఫిట్ షోలకు అనుమతించాలని సాహో చిత్ర నిర్మాతలు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు . అయితే  తెలంగాణ ప్రభుత్వం మాత్రం ‘సాహో’ చిత్ర నిర్మాతల కోరికను  సున్నితంగా తిరస్కరించింది.


 బాహుబలి- 2  చిత్రం  తర్వాత తెలంగాణ ప్రభుత్వం, సినిమా టికెట్ల ధరల పెంపుకు,  బెనిఫిట్ షోస్‌ కు  అనుమతి ఇవ్వలేదు. అయితే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం సాహో చిత్ర నిర్మాతల కోరికను మన్నించి టికెట్ల ధరల పెంపుకు అనుమతించింది . జగన్ సర్కార్ సాహో నిర్మాతల కోరిక మన్నించడానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాసే కారణమని తెలుస్తోంది . ఇటీవల ఒక వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి పాలన బాగుందని , రాష్ట్రాభివృద్ధి కోసం జగన్ కృషి చేస్తున్నారని కితాబునిచ్చిన విషయం తెల్సిందే . ప్రభాస్ వ్యాఖ్యలతో వైకాపా వర్గాలు ఆనందం తో ఉబ్బితబ్బిబ్బు అవుతున్నాయి .ఇదే  క్రమం లో ప్రభాస్ హీరోగా నటించిన సాహో చిత్రానికి టికెట్ల పెంచుకునేందుకు అనుమతించాలని నిర్మాతలు కోరగానే జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న వాదనలు విన్పిస్తున్నాయి .


 అయితే గతం లోను టీడీపీ ప్రభుత్వ హయాం లో నూతన సినిమాల టికెట్లను పెంచుకునేందుకు అనుమతించింది వైకాపా వర్గాలు గుర్తు చేస్తున్నాయి . తెలంగాణ ప్రభుత్వం టికెట్ల పెంపు కు అనుమతి ని నిరాకరించగా , ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హాట్ టాఫిక్ గా మారింది .


మరింత సమాచారం తెలుసుకోండి: