ఏలియన్స్.. ఎన్నో ఏళ్ల నుంచి ఇక ఈ పదం ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంటుంది. ఏలియన్స్ ఉన్నాయి అనే ప్రచారం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. నిజంగానే ఏలియన్స్ ఉన్నాయా? ఇక అవి వేరే గ్రహం నుంచి భూమ్మీదకు వచ్చి  పోతూ ఉంటాయా?.. ఇక ఏలియన్స్ దగ్గర ఉన్న సరికొత్త టెక్నాలజీతో మనుషులను ఎప్పుడు కనిపెడుతూనే ఉంటాయా?.. ఇక ఏలియన్స్ కు మనుషులు శత్రువులా మిత్రులా.. ఇక ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడూ తలెత్తుతూనే ఉంటాయి. అంతేకాదు ఇక ఆకాశంలో ఏదైనా వింతగా  విమానం లాంటిది ఎగురుతున్నట్లు కనిపిస్తే ఇక అది ఏలియన్స్ దే అని అందరూ ఫిక్స్ అయి పోతూ ఉంటారు.


 కానీ ఇప్పటివరకు ఏలియన్స్ ఉన్నాయి అన్న దానికి మాత్రం ఎక్కడా స్పష్టమైన ప్రూఫ్ మాత్రం లేదు అని చెప్పాలి. అయితే అప్పుడప్పుడు ఎక్కడైనా వింత జీవి కనిపిస్తే అది ఏలియన్ అని ఫిక్స్ అయి పోతూ ఉంటారు జనాలు. అదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఇక ఇటీవలే ఆస్ట్రేలియాలో ఒక వింత ఆకారం కనిపించడంతో అది ఏలియన్ అంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు అక్కడ స్థానికంగా ఉండే జనాలు. దీంతో ఇది కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.



 ఆస్ట్రేలియా లోని క్వీన్స్ ల్యాండ్ మార్ చి డోర్ బీచ్ ఒడ్డున వింత జీవి కళేబరం కనిపించింది. దీంతో ఇది చూసి షాక్ అయ్యారు స్థానికులు. ఇక అలెక్స్ టాన్ అనే పర్యాటకుడు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక ఈ వింత జీవి ని మీరు ఏమనుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో ఒక ప్రశ్న కూడా వేశాడు. తాను గతంలో ఎప్పుడూ కూడా ఈ జీవిని చూడలేదని.. ఈ జీవి కాస్త విచిత్రంగా ఉందని గ్రహాంతరవాసి అని నేను అనుకుంటున్నాను అంటూ తెలిపారు సదరు వ్యక్తి. ఇక ఈ వింత జీవి ని చూసిన తర్వాత సోషల్ మీడియాలో నెటిజెన్స్ కూడా కాస్తచిత్ర విచిత్రంగా కామెంట్లు పెడుతూ ఉండటం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: