సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడో మారుమూలన జరిగిన ఘటనలు కూడా క్షణకాలు వ్యవధిలో  సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఎక్కడో దేశ విదేశాలలో జరిగిన ఘటనలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి.  ఇలాంటి తరహా ఆశ్చర్యకరమైన ఘటనలు తరచూ  వెలుగులోకి వస్తూనే ఉంటాయ్ అని చెప్పాలజ్. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఆస్ట్రేలియాకు చెందిన ఎలైట్ జాతికి చెందిన ఒక గొర్రె గురించి వార్త వైరల్ గా మారిపోయింది. అదేంటి గొర్రె గురించి చెప్పుకోవడానికి ఏముంటుంది అని అనుకుంటున్నారు కదా.


 ఇటీవల వేలంపాటలో సదరు గొర్రె పలికిన రికార్డు ధర గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు  అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏకంగా వేలంపాటలో ఎలైట్ జాతికి చెందిన గొర్రెను ఆస్ట్రేలియన్ వైట్ సిండికేట్ కు చెందిన వ్యక్తులు రెండు కోట్లకు దక్కించుకోవడం గమనార్హం. ఏంటి గొర్రెను దక్కించుకోవడానికి రెండు కోట్లు పెట్టారా ఆ డబ్బులతో ఇంకేదైనా వ్యాపారం చేసి ఉంటే బాగుండేది లేదంటే అదే డబ్బులతో వేల గొర్రెలను కూడా కొనే అవకాశం ఉంది అని అంటారు ఈ విషయం తెలిసిన వారు ఎవరైనా.


 అయితే ఎలైట్ జాతికి చెందిన గొర్రె ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గొర్రెలలో ఒకటిగా నిలిచిపోయింది. అయితే జన్యుపరంగా వ్యాధి నిరోధక శక్తి ఈ గొర్రెకు ఎక్కువగా ఉంటుందట. అంతేకాదు వేగంగా ఎదుగుతుందట. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే గొర్రె యజమాని కూడా అంత ధర రావడం పట్ల ఆశ్చర్యపోయాడట. ఆస్ట్రేలియాలో గొర్రెల మాంసం పరిశ్రమ పెరుగుతుంది. కాగా శరీరంపై బొచ్చు లేని కారణంగానే ఈ గొర్రెకు మంచి డిమాండ్ ఏర్పడిందట. గతంలో ఇదే జాతికి చెందిన ఒక గొర్రె 1.25  కోట్లకు అమ్ముడుపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri