ఆఫ్ఘనిస్తాన్ లో ప్రస్తుతం ఎంత రాక్షస పాలన కొనసాగుతూ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రజాస్వామ్య బద్దంగా సాగుతున్న పాలనను మంట కలిపి ఏకంగా ఆయుధాలతో మారణ హోమాన్ని సృష్టించి తాలిబన్లు అధికారాన్ని చేపట్టారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాలిబన్లు ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఒక్కసారిగా ఆఫ్గనిస్తాన్ ప్రజల జీవనశైలి అస్తవ్యస్తంగా మారిపోయింది అని చెప్పడంలో అభిషేకం లేదు. అప్పుడప్పుడే స్వేచ్ఛను చూస్తున్న అక్కడి మహిళలకు మరోసారి జీవితం దూర్పరంగా మారిపోయింది అని చెప్పాలి.


 తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మహిళలకు సమచిత గౌరవం కల్పిస్తాము అంటూ కల్లబొల్లి మాటలు చెప్పిన తాలిబన్లు.. ఇక ఆ తర్వాత మాత్రం ఏకంగా మహిళలను వంటింటి కుందేలు గానే మార్చేశారు. చదువులు  చదవనివ్వకుండా, ఉద్యోగాలు చేయనీయకుండా, ఏ క్రీడారంగంలో రానించకుండా నిషేధం విధిస్తూ వచ్చారు. దీంతో మహిళలు అందరూ కూడా ఇక స్వేచ్ఛ లేని జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఇక ఎవరైనా మహిళలు తాలిబన్లు తీరును వ్యతిరేకిస్తూ నిరసనలు చేపడితే.. వారిపట్ల కర్కశంగా  వ్యవహరిస్తూ ఉండడం కూడా ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.


 అయితే ఇలా ఇటీవల కాలంలో మహిళలు స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా తాలిబన్లు తీసుకున్న నిర్ణయాలపై ఒక కీలక ప్రకటన చేశారు. ఆఫ్ఘనిస్తాన్ లో అమ్మాయిలు హైస్కూల్లో కాలేజీలు వర్సిటీలో చదువుకోకుండా విధించిన నిషేధం శాశ్వతం కాదు అంటూ తాలిబన్ ప్రతినిధి ఒకరు ప్రకటన చేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది. స్కూలు కాలేజీలు వర్సిటీలో అమ్మాయిలకు అనువైన వాతావరణం కల్పించిన తర్వాత ఇక వారు మళ్లీ తిరిగి చదువుకునేందుకు అవకాశం కల్పిస్తాము అంటూ చెప్పుకొచ్చారు. మహిళా విద్యకు తాము ఎప్పుడు వ్యతిరేకం కాదు అంటూ తాలిబన్ ప్రతినిధి చెప్పడం గమనార్హం. అయితే ఇక ఇది ఎప్పటి వరకు పూర్తి అవుతుంది అన్నదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వకపోవడం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: