
అయితే ఇక ఏ యాప్ లో కూడా లేనప్పుడు టిక్ టాక్ లో షార్ట్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. కానీ టిక్ టాక్ పై బ్యాన్ విధించిన తర్వాత ఇక ఇప్పుడు ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ అంటూ అంతటా కూడా ఇలాంటి షార్ట్ రీల్స్ కనిపిస్తున్నాయి అని చెప్పాలి. ఇకపోతే ఆ తర్వాత ఏం జరిగిందో ఇక భారత ప్రభుత్వం వినియోగదారుల భద్రతకు భంగం వాటిల్లుతుంది అని టిక్ టాక్ పై నిషేధం విధించాయి. కేవలం టిక్ టాక్ పైన కాదండోయ్ చైనాకు సంబంధించిన అన్ని యాప్స్ పై బ్యాన్ విధించింది భారత ప్రభుత్వం. అయితే ఇక ఇండియా బాటలోనే మరికొన్ని దేశాలు కూడా నడిచాయి అన్న విషయం తెలిసిందే.
ముఖ్యంగా టిక్ టాక్ యాప్ పై బ్యాన్ విధిస్తున్న దేశాల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. మొన్నటికి మొన్న కెనడా ప్రభుత్వం సైతం ఈ యాప్ పై నిషేధం విధించింది. ఇక ఇప్పుడూ బ్రిటన్ లో కూడా ఈ యాప్ బ్యాన్ అయింది అని చెప్పాలి. చైనా మూలాలు ఉన్న ఈ సామాజిక మాధ్యమం యాప్ ను భద్రతాపరమైన కారణాలతో నిషేధిస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. యూకే మంత్రి ఇక ఈ విషయాన్ని ధృవీకరించారు. ప్రభుత్వ డేటా సమాచారాన్ని టిక్ టాక్ వాడుకోవడం ప్రమాదకరమని ఆయన చెప్పుకొచ్చారు. అయితే యాప్ వినియోగదారుల సమాచారాన్ని చైనా ప్రభుత్వంతో పంచుకుంటున్నట్లు వస్తున్న ఆరోపణలను అటు టిక్ టాక్ మాత్రం ఖండిస్తూ ఉండటం గమనార్హం.