
ఊరుకోండి బాసూ వర్షాలు పడని ప్రాంతం ఏంటి భూమ్మీద అలాంటి చోటు ఒకటి ఉంటుందా అని అంటారు ఎవరైనా. కానీ ఇక్కడ ఏకంగా వర్షాలు పడని ప్రాంతం ఉంది అది కూడా ఒకటి రెండు ఏళ్ళు కాదు దాదాపు 20 లక్షల ఏళ్ల నుంచి కూడా అక్కడ ఆ ప్రాంతంలో ఒక్క చుక్క వర్షం కూడా పడలేదు అనడంలో అతిశయోక్తి లేదు. 20 లక్షల ఏళ్ల నుంచి ఏంటి గురు.. అసలు ఎందుకు అక్కడ వర్షాలు పడవు అనే అనుమానం వచ్చింది కదా. అసలు స్టోరీలోకి వెళ్తే భూమ్మీద అత్యంత పొడి ప్రదేశమైన అంటార్కిటికాలో ఇలా వర్షం పడని ప్రాంతం ఉంది.
డ్రై వ్యాలీస్ అనే ప్రాంతంలో వర్షం పడదు. ఇక ఇక్కడ వర్షాలు పడకపోవడానికి కారణం కాటబాటిక్ గాలులు. పర్వతాల నుంచి వచ్చే తేమతో కూడిన గాలులు కారణంగానే ఆ ప్రాంతంలో ఒక్క చుక్క కూడా వర్షం పడదు అని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇక్కడ ఉండే బోనీ సరస్సులోని నీరు సముద్రపు నీటి కంటే మూడు శాతం ఎక్కువగా ఉప్పుగా ఉంటాయంటూ అక్కడ పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏది ఏమైనా ఇలా భూమ్మీద వర్షాలు పడని ప్రాంతం ఒకటి ఉంది అని తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు.