
ప్రేమ గుడ్డిది అంటే ఏమో అనుకున్నాం కానీ మరి ఇంత గుడ్డిది అని మాత్రం అసలు అనుకోలేదు అని ప్రతి ఒక్కరు కూడా అనుకునేలా కొన్ని లవ్ స్టోరీలు సోషల్ మీడియాలో తెరమీదకి వస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి లవ్ స్టోరీ గురించే. ఇక్కడ ఒక అమ్మాయి ప్రేమలో పడింది. ఏకంగా డీప్ లవ్ లో మునిగిపోయింది. ఇక ఇలాంటి ప్రేమ తనకు ఇప్పటివరకు జీవితంలో దొరకలేదు అంటూ తన ప్రేమ గురించి గొప్పగా అభివర్ణిస్తూ ఉంది ఆ అమ్మాయి. ఇంత గొప్పగా చెబుతుందంటే అబ్బాయి చాలా మంచి వాడే అయి ఉంటాడు అనుకుంటున్నారు కదా.
అలా అనుకుంటున్నారంటే మీరు పప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే ఆ అమ్మాయి ప్రేమించింది అబ్బాయిని కాదు. కొంపతీసి మరో అమ్మాయిని ప్రేమించిందా అంటారా? అమ్మాయిని కూడా ప్రేమించలేదు. ఏకంగా ఒక చెట్టును ప్రేమించి డీప్ లవ్ లో మునిగిపోయింది. కెనడాలోని వాంకోవార్ ద్వీపానికి చెందిన సోంజు అనే మహిళ ఓ చెట్టుతో పీకల్లోతు ప్రేమలో పడింది. ఆ చెట్టుతో శృంగార సంబంధం కలిగి ఉన్నానని చెబుతుంది. 2020 కోవిడ్ సమయంలో ఓ చెట్టు దగ్గర తరచు వాకింగ్ చేశా. అప్పుడే ఆ చెట్టుతో నాకు సంబంధం ఏర్పడింది. చెట్టుకు హాగ్ చేసుకున్నప్పుడు నాకు కలిగే సెక్సువల్ ఎనర్జీని నా భాగస్వామి లోను కోరుకుంటా అంటూ సదరు మహిళ చెబుతున్న మాటలు అందరిని అవాక్కయ్యేలా చేస్తున్నాయి.