సాధారణంగా పిల్లల పుట్టిన తేదీలు తల్లిదండ్రులకు ఎంతో స్పెషల్. ఎందుకంటే ఇక ప్రతి ఏటా పిల్లలు పుట్టిన తేదీలను గుర్తుంచుకొని మరి ఇక వారి పుట్టినరోజు వేడుకను ఎంతో ఘనంగా జరపడానికి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ప్రతి పుట్టిన రోజును తమ పిల్లలకు మరుపురాని రోజుగా మిగిలేలా ఇక సెలబ్రేషన్స్ చేయడం చూస్తూ ఉంటాం. అయితే కొంతమంది తల్లిదండ్రులు అయితే ఇలా పుల్లల పుట్టిన తేదీని తమకు బాగా కలిసి వచ్చే తేదీగా కూడా భావిస్తూ ఉంటారు. ఇక ఏదైనా  పని ప్రారంభించాలి అనుకున్నప్పుడు అదే తేదీన ప్రారంభించడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు ఎంతోమంది తల్లిదండ్రులు.


 అయితే ఇప్పుడు వరకు ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లల పుట్టిన తేదీలను అదృష్టంగా భావించి ఇక అదే రోజు ఎన్నో మంచి పనులు చేయడం చూశాము. కానీ ఇక్కడ మాత్రం ఒక విచిత్రకరమైన ఘటన జరిగింది. ఏకంగా పిల్లల పుట్టిన తేదీలే ఆ తల్లిదండ్రులకు కోట్ల రూపాయలు తెచ్చిపెట్టాయ్. అదేంది పుట్టిన తేదీలు కోట్ల రూపాయలు ఎలా తెచ్చిపెడతాయి.. వినడానికి విడ్డూరంగా ఉంది అని అనుకుంటున్నారు కదా. కానీ ఇది ఇక్కడ నిజంగానే జరిగింది. ఏకంగా పిల్లల పుట్టిన తేదీలు ఆ తల్లిదండ్రులకు 11.6 కోట్ల రూపాయలను తీసుకొచ్చి పెట్టాయి అని చెప్పాలి. ఇక ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు.


 ఇంతకీ ఏం జరిగిందంటే.. అమెరికాలోని ఇల్లీ నాయిస్ కు చెందిన ఒక మహిళకు 1. 4 మిలియన్ల రూపాయల లాటరీ తగిలింది. అంటే భారత కరెన్సీ ప్రకారం 11.60 కోట్ల రూపాయలు లాటరీలో గెలుచుకుంది సదరు మహిళ. అయితే పిల్లల పుట్టిన తేదీలతో ఉన్న లాటరీ గేమ్ ఆడిన ఆమెకు ఇలా అదృష్టం కలిసి వచ్చింది. 6 - 8 - 16 -  17 -  20 ఆమె లక్కీ నెంబర్లు. ఇక ఈనెల ఏడవ తేదీన ఆ భారీ మొత్తానికి చెక్ అందుకున్న ఆమె వ్యక్తిగత వివరాలను వెల్లడించడానికి మాత్రం పెద్దగా ఆసక్తిని చూపించలేదు. ఇక ఈ నెలకు ఏకంగా 5,50,000 మంది లాటరీ టికెట్ కొనుగోలు చేయగా ఇక సదరు మహిళ మాత్రం లక్కీ విన్నర్ గా నిలిచింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: