వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో యాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన డీహైడ్రేషన్‌కు గురవుతున్నారని ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. శరీరంలో నీరు లేకపోవడాన్ని డీహైడ్రేషన్‌ అంటారని... తాగిన నీటికంటే ఎక్కువ నీటిని శరీరం కోల్పోతుంటే డీహైడ్రేషన్‌ వస్తుందని వైద్యులు తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పగలు మండుటెండలు, సాయంత్రం చలిగా ఉంటోందని, ఎక్కువసేపు చంద్రబాబు ఎండలో నడవడంతో బాబుకు గొంతు నొప్పి వస్తోందని వైద్యులు తెలిపారు. అదే సమయంలో చంద్రబాబు తన ప్రసంగాల సమయాన్ని తగ్గించుకోవాల్సిందిగా సూచించారు. ఎడమ కాలి చిటికెన వేలు నొప్పి తిరగబెడుతూనే ఉందన్నారు. రెండు, మూడు రోజుల్లో ప్రత్యేక వైద్య బృందం చంద్రబాబును పరీక్షించేందుకు వస్తుందని డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: