హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి లో తల్లి రజిత ను హత్య చేసిన కీర్తిరెడ్డి కి అబార్షన్ చేసిన ఆసుపత్రిని సీజ్ చేశారు. అమన్ గల్  లోని ఈ ఆసుపత్రిని గుర్తించిన రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్ఓ ఆసుపత్రిని సీజ్ చేస్తున్నట్లు తెలిపారు .  కీర్తిరెడ్డి తన మొదటి ప్రియుడు బాల్ రెడ్డి వల్ల గర్భవతి కావడం తో అబార్షన్ చేయించుకోవడానికి తన ఇంటి పక్కనే ఉన్న శశికుమార్ సహాయం కోరింది . ఈ ముగ్గురు కలిసి ,అబార్షన్ కోసం ఎల్బీ నగర్ పరిధిలోని సహారా ఎస్టేట్ లో నివసించే ఒక వైద్యున్ని సంప్రదించినట్లు తెలుస్తోంది . ఆ డాక్టర్  సూచన మేరకు అమన్ గల్ లోని ఒక ఆసుపత్రి లో కీర్తి రెడ్డి ని చేర్పించి ఈ ఏడాది జనవరి లో  గర్భస్రావం చేయించినట్లు సమాచారం .


 గుట్టు చప్పుడు కాకుండా కీర్తిరెడ్డి కి గర్భస్రావం జరిగిన , ప్రస్తుతం ఆమె తల్లిని హత్య చేయడం తో ఈ విషయం వెలుగు చూసింది. రజిత హత్య కేసుతో ప్రమేయం ఉన్న కీర్తిరెడ్డి , శశికుమార్ లు ఇద్దరు జీవితం లో దారితప్పినవారేనని మానసిక నిపుణులు విశ్లేషిస్తున్నారు . కీర్తిరెడ్డి తండ్రి మద్యానికి బానిసయి కుటుంబాన్ని పట్టించుకోకపోగా , తల్లి ఆర్ధిక పరిపుష్టి కోసం డబ్బు సంపాదనపైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది . దీనితో తల్లితండ్రులు వద్ద దొరకని ప్రేమను ఇతరుల వద్ద వెతుక్కునే ప్రయత్నం లో కీర్తిరెడ్డి విచ్చలవిడితనానికి అలవాటుపడినట్లు చెబుతున్నారు .


ఇక శశికుమార్ కుటుంబ నేపధ్యం కూడా ఇంచుమించు అదే విధంగా ఉండడం వల్లే సునాయాసంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యం తో హత్య కేసులో ఇరుక్కున్నాడని అంటున్నారు . శశికుమార్ తండ్రి కి ఇద్దరు భార్యలు ఉండడం , అతడు అవినీతిపరుడు కావడం తో , కొడుకు కూడా కనీస మానవ విలువలు లేకుండా తన ఇంటిపక్కనే నివసించే మహిళ ను దారుణంగా హత్య చేశాడని అంటున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: