న్యాయం ఎప్పుడు గెలుస్తుంది... కాస్త ఆలస్యమైనా న్యాయం  గెలవక తప్పదు అన్యాయం ఓడిపోక తప్పదు అని పురాణాల్లో కూడా రాసి ఉంది. ప్రస్తుతం అదే నిరూపణ అయింది. ఎన్నో రోజుల నుండి దేశం మొత్తం న్యాయం కోసం ఎదురుచూస్తున్న నిర్భయ ఘటనలో  ఎట్టకేలకు అన్యాయం జరిగింది. దుర్మార్గానికి పాల్పడినప్పటికీ  చట్టాలలోని లొసుగుల ఉపయోగించుకుంటూ కాలయాపన చేస్తూ వస్తున్న నిర్భయ దోషులకు ఉరి బిగుసుకుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నది మరొకసారి నిరూపణ అయింది. నిర్భయ దోషులకు ఎట్టకేలకు ఉరి అమలైంది. గత ఏడు సంవత్సరాల నుంచి దేశం మొత్తం ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. నిన్న పటియాల హౌస్ కోర్టు నిర్భయ దోషులు  వేసిన పిటిషన్ను కొట్టివేస్తూ న్యాయపరంగా ఉన్న అవకాశాలన్ని  అయిపోయాయని... చెబుతూ ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. 

 

 

 

 ఇక దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద జైలు అయినా తీహార్ జైలు లో నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమల అయింది. ఇప్పటికే నిర్భయ కేసులో నలుగురు నిందితులు ఉరిశిక్ష పూర్తవగ వారి బాడీలను పోస్టుమార్టం చేస్తున్నారు. అయితే గత ఏడేళ్ల నుంచి న్యాయ పోరాటం చేస్తున్న నిర్భయ తల్లిదండ్రుల న్యాయపోరాటం ఎట్టకేలకు ఫలించింది. నిర్భయ దోషులకు ఉరి శిక్ష పడడం పై దేశం మొత్తం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. నిర్భయ దోషులకు శిక్ష పడేందుకు  కాస్త సమయం పట్టినా ఎట్టకేలకు న్యాయం జరిగింది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

 

 

 అయితే నిర్భయ దోషులకు కాసేపటి క్రితమే ఢిల్లీలోని తీహార్ జైలులో ఉరి శిక్ష అమలు చేశారు అధికారులు. అయితే ఉరిశిక్ష అమలు చేయడానికి నలుగురు నిందితులను ఉరికంబం  దగ్గరికి తీసుకు రాగా నిర్భయ నిందితులకు లోని ఒక నిందితుడు బోరున విలపించాడు. నిర్భయ నిందితుల్లో ఒకరైన వినయ్ శర్మ ఉరికంబం దగ్గరికి తీసుకురాగానే బోరున విలపించాడట. జైలు అధికారులు అతని చేతులు వెనక్కి కట్టి ఉంచగా... వెక్కి వెక్కి ఏడ్చాడట వినయ్ శర్మ. తెల్లవారుఝామున నిద్ర లేచినప్పటినుంచి దుఃఖాన్ని తనలోనే ఆపుకున్న నిర్భయ నిందితుడు  వినయ్  శర్మ ఉరికంభం దగ్గరికి రాగానే దుఃఖాన్ని ఆపుకోలేక బోరున విలపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: