ప్రపంచమంతా కరోనాతోనే గడిపే పరిస్థితి వచ్చింది. చైనా పుణ్యమా అని ఈ రోజు బిక్కు బిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. అయితే కరోనా గురించి రోజూ ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూ ఉంటుంది. కొన్ని వార్తలు మనకు పాజిటివ్ బూస్ట్ ఇచ్చే విధంగా ఉంటే, మరికొన్ని వార్తలు ప్రజలను కంగారు పెట్టేవిధంగా ఉంటున్నాయి. ఇప్పటికీ లక్షలమంది ఈ వ్యాధి బారిన పడ్డారు. వీరిలో దాదాపుగా చాలా మంది చికిత్స తీసుకుని బయటపడ్డారు. అయితే వీరు ఇప్పుడు మరింత జాగ్రతగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు మరి ఆ వివరాలేంటో ఒక్కసారి ఏపీహెరాల్డ్ ఆర్టికల్ వైపు లుక్కేయండి.

 కరోనా ఓ సారి వచ్చిందంటే మళ్లీ రావడం చాలా అరుదు. కానీ కొంతమంది వైద్య శాస్త్రజ్ఞులు ఎన్నో ప్రయోగాల తరువాత మళ్ళీ కరోనా రెండోసారి కూడా సోకవచ్చని చెబుతున్నారు. మొదటి సారి కంటే రెండో సారి కరోనా వస్తే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మొదటి సారి కరోనా సోకితే హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకోచ్చని.. కానీ రెండో సారి కరోనా వస్తే మాత్రం కచ్చితంగా ఆస్పత్రికి వెళ్లి ఆక్సిజన్ పెట్టుకోవాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు. రెండో సారి కరోనా సోకితే ఆ వ్యక్తికి సరిపడా ఆక్సిజన్ను ఊపిరితిత్తులు అందజేయలేవని వైద్యులు అంటున్నారు. నెవడాకు చెందిన ఓ వ్యక్తికి కరోనా రెండో సారి సోకింది. అతడికి మొదటి సారికంటే రెండోసారి వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా కనిపించిందని వైద్యులు చెబుతున్నారు.

మార్చి 25 సదరు యువకుడికి తొలిసారి కరోనా లక్షణాలు కనిపించాయి. గొంతు నొప్పి దగ్గు వికారం తలనొప్పి విరేచనాలు వంటి లక్షణాలు బయటపడ్డాయి. దీంతో 18 ఏప్రిల్ కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని కన్ఫామ్ అయింది. దీంతో వైద్యుల సూచన మేరకు మందులు వాడాడు. కాగా 27న కరోనా లక్షణాలు అన్ని పోయాయి. మే 9 , 26 తేదీల్లో అతడికి మరోసారి పరీక్షలు చేయగా నెగిటివ్ అని తేలింది. కానీ మే 28న మళ్లీ కరోనా లక్షణాలు వచ్చాయి. జ్వరం తలనొప్పి శ్వాస అందకపోవడం దగ్గు వికారం మైకం లాంటివి కనిపించాయి. 5 జూన్ – రెండోసారి పాజిటివ్ వచ్చింది. శ్వాస అందకపోవడం (లో బ్లడ్ ఆక్సిజన్) సమస్య వచ్చింది. అతడికి మొదటిసారికంటే రెండోసారి కరోనా తీవ్రంగా వచ్చిందని వైద్యులు చెబుతున్నారు. ఒకసారి కరోనా వచ్చి తగ్గినవారు నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు చెబుతున్నారు. తగిన జాగ్రత్తలు పాటించాల్సిందేనని చెబుతున్నారు.  కాబట్టి ముందస్తుగా ఎటువంటి కరోనా లక్షణాలు కనిపించినా వెంటనే హాస్పిటల్ కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవడం పరిపాటి. 

మరింత సమాచారం తెలుసుకోండి: