రోజులు గడుస్తున్నప్పటికీ భారతదేశం ను మాత్రం  కరోనా  వైరస్ వదలడం లేదు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణం లో భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ కరోనా వైరస్ నియంత్రణ కు చర్యలు చేపడుతూనే ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి భారత్కు వస్తున్న వారి దృశ్య భారత్ లో  కరోనా వైరస్ వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. ఇక ఇదే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వ ఇతర దేశాల నుంచి భారత్కు వచ్చే వారిపై కఠినమైన ఆంక్షలు విధిస్తున్నది. భారత్ లో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరికి కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తోంది.


 తద్వారా కరోనా వైరస్ బారిన పడిన వారిని గుర్తించి వారికి ఆర్ టి పి సి ఆర్ పరీక్షలు చేసి కరోనా వైరస్ నియంత్రణకు ప్రయత్నాలు చేస్తుంది భారత ప్రభుత్వం. కానీ  కొంతమంది ప్రయాణికులు మాత్రం కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకోవడానికి అధికారులకు సహకరించడం లేదు. భారత్ చేరుకున్న తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పరీక్షలు చేసుకోకుండానే యదేచ్చగా పబ్లిక్ లో తిరుగుతున్నారు.  ఇక ఇలాంటి వారిని కట్టడి చేసి కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి కూడా మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.



 భారత్ కు  వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులందరూ కూడా ఎయిర్పోర్టులో ఆర్ టి పి సి ఆర్ పరీక్షలు చేసుకోవాలి అంటూ తప్పనిసరి నిబంధన పెట్టింది. ఒకవేళ ఆర్ టి పి సి ఆర్ పరీక్షలు చేసుకోకపోతే వారిని క్వారంటైన్ కి తరలించాల్సి ఉంటుంది అంటూ తెలిపింది.  అంతర్జాతీయ ప్రయాణికులందరూ 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండక తప్పదు అంటూ తెలిపింది. అంతే కాకుండా అంతర్జాతీయ ప్రయాణికులు బయలుదేరే 72 గంటల ముందు ధ్రువీకరణ పత్రాలను పంపాలి అంటూ సూచించింది కేంద్ర ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: