ప్రపంచమంతా కరోనా విలయ తాండవానికి అల్లాడుతున్న నేపథ్యంలో మొట్టమొదటిగా ఈ మహమ్మరి కరోనా వైరస్ కి వ్యాక్సిన్ ని కనుగొన్న దేశం రష్యా. దీనికి ఆ దేశ ప్రధమ పౌరుడు మరియు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చొరవను ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. ఈ వ్యాక్సిన్ ఇప్పుడు ట్రైల్స్ దశనుండి పూర్తిగా తయారీ దశల్లో ఉంది. పుతిన్ పాలనా పరంగా కూడా రష్యా దేశ ప్రజలలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎల్లప్పుడూ ప్రజల క్షేమం కోసమే ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఈయన తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నారని వార్త హల్ చల్ చేస్తోంది. అసలు ఏమి జరిగింది...ఈ వార్త నిజమా తెలుసుకోవాలనుందా అయితే కింద ఇచ్చిన ఏపీహెరాల్డ్ ఆర్టికల్ ను చదవండి.
 
సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్న వార్త నిజమే తెలుస్తోంది. ఈ వార్త రష్యా ప్రజలకే కాక ప్రపంచంలోని ప్రజలందరికీ షాక్ గా చెప్పొచ్చు. తన అధ్యక్ష కాలంలో రష్యాలోని రాజ్యాంగాన్ని ప్రజలకు అనుకూలంగా మార్చిన పుతిన్ రష్యా అధ్యక్ష పదవికి రాజీనామా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. యింతకీ విషయమేమిటంటే పుతిన్ అత్యంత అరుదుగా సోకే పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారని, ప్రస్తుతము ఆ వ్యాధి మొదటిదశలో ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారని మీడియా ద్వారా తెలిసింది.  ఇటువంటి పరిస్థితుల్లో పుతిన్ అధ్యక్షుడిగా కొనసాగడం కష్టమని వైద్యులు చెబుతున్నట్లు ప్రచారంలో ఉంది.  ఇదే కనుక నిజమైతే వచ్చే 2021 జనవరిలో పుతిన్ రాజీనామా చేసే అవకాశం ఉంది.  

మాములుగా ఈ వ్యాధి ఇటువంటి వారికి సంక్రమించడం అసాధ్యం అని అంటున్నారు ప్రముఖ వైద్యులు. ఎందుకంటే పుతిన్ 68 ఏళ్ళు పైబడుతున్నా ఇప్పటికీ ప్రతిరోజూ వ్యాయామం చేస్తుంటారు. అంతేకాకుండా గుర్రపు స్వారీ కూడా చేస్తుంటారని తెలిసింది. ఇన్ని అనుకూలతలు ఉన్నా కూడా ఇటువంటి పార్కిన్సన్ వ్యాధి ఎలా సోకింది అన్నది వైద్యులకు అంతుబట్టడం లేదంట.  ఇకపోతే ఈ వార్తను అక్కడి ప్రజలు నమ్మడంలేదని, పుతిన్ అధ్యక్షుడిగా కొనసాగుతారని విశ్వసిస్తున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: