జీవితంలో మనము అనుకోని విషయాలు ఎన్నో జరుగుతుంటాయి. కానీ కొన్ని మన క్రియల వలన జరుగుతాయి, మరికొన్ని మన టైం బాగా లేకపోతే జరుగుతాయి. ఇదంతా మనము ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో తెలుసా. అదేనండి మాజీ అమెరికా అధ్యక్షుడు అయిన ది గ్రేట్ డోనాల్డ్ ట్రంప్ గురించే. ఇంతకీ ఏమైందంటే ఇప్పటికే అధ్యక్షా ఎన్నికలలో జో బైడెన్ చేతిలో ఓడిపోయి పుట్టెడు దుఃఖంలో ఉంటె ఇప్పుడు పిడుగులాంటి మరో వార్త అతని మనసును కకావికలం చేసింది. అదేమిటో తెలుసుకోవాలనుందా. అయితే కింద ఇచ్చిన ఏపీహెరాల్డ్ ఆర్టికల్ ను చదవండి.

డోనాల్డ్ ట్రంప్ భార్య మెలానియాతో ట్రంప్‌ సంబంధాలు దాదాపుగా తెగతెంపులయినట్లు తెలుస్తోంది. ఈ షాకింగ్ న్యూస్ ని మెలానియా ట్రంప్ మాజీ అసిస్టెంట్ ఒమరోసా న్యూమ్యాన్ స్వయంగా మీడియాతో చెప్పినట్లు వార్త ప్రచారంలో ఉంది. దీనితో ట్రంప్ మరింత బాధకు గురయ్యారు. గతంనుండి వీరి మధ్య సంబంధ బాంధవ్యాలు అంతగా బాగాలేవని తెలిసింది. అయితే ట్రంప్ అధ్యక్షా పదవిలో ఉన్నారు కాబట్టి ఇంతకాలం ఇవి బయటకు రాలేదు. కానీ ఇప్పుడు ఎలాగూ పదవి పోయింది కాబట్టి, ట్రంప్ వైట్ హౌస్ నుంచి బయటకు రాగానే మెలానియా అతనికి విడాకులు ఇవ్వబోతోందని వార్తలు వస్తున్నాయి. వీరి వివాహం జరిగి పదిహేను సంవత్సరాలు జరిగినా ఇంకా వీరి మధ్య మనస్పర్థలు రావడం ఆశ్చర్యకరంగా ఉంది.  అయితే ట్రంప్ దీనిపై ఏవిధంగా స్పందిస్తారనేది తెలియరాలేదు.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే అప్పట్లో ట్రంప్‌ అధ్యక్షుడు అయిన వెంటనే ఆమె వైట్ హౌస్ కు రాలేదన్న విషయం ఎవరికీ తెలియదు. తరువాత మెల్లగా 5 నెలలకు మెలానియా వైట్‌ హౌస్‌ కి వచ్చారు. దీనికి కారణం  కొడుకు బారెన్‌ స్కూల్ విలయమని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇప్పుడు ఏమి జరగనుందో అని అంతా ఎదురుచూస్తున్నారు. కొంతమందైతే జో బైడెన్ వీరిద్దరినీ విడగొట్టారని అనుకుంటున్నారు. మరి మరికొద్ది రోజుల్లో ఏమిజరుగుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: