బంగారాన్ని అర్హతను మించి విదేశాల నుంచి తీసుకురావద్దని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. అయిన కొందరు ప్రబుద్ధులు మాత్రం పోలీసుల కంట పడకుండా ఏదోక విధంగా బంగారాన్ని ఇండియాకు తీసుకొని వస్తున్నారు. ఇక్కడ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి.. ఇటీవల హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత జరిగిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది.


వివరాల్లోకి వెళితే..బంగారం, విదేశీ కరెన్సీని విగ్గుల్లో పెట్టి, అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నించిన వ్యక్తులను చెన్నై విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. వీరి నుంచి 5.5 కేజీల బంగారాన్ని, రూ.24 లక్షల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.2.53 కోట్లు అని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. రామనాథ పురానికి చెందిన మగ్రూబ్ అక్బరాలీ , చెన్నైకి చెందిన హసన్ రఫియుద్దీన్ ల హెయిర్ స్టైల్ విచిత్రంగా ఉండటంతో అనుమానం వచ్చింది. వారిని ఎగ్జిట్ గేట్ వద్ద ప్రశ్నించారు. పాక్షికంగా గుండు చేయించుకుని, విగ్గులు ధరించినట్లు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అసలు మర్మరం తెలిసింది.


వారి విగ్గుల వెనకాల బంగారపు ముద్ద దాగివుంది అని అధికారులు వెల్లడించారు.వీటిలో 698 గ్రాముల బంగారం ముద్ద ఉంది.శుక్రవారం జరిపిన సోదాల్లో సయ్యద్ అహ్మదుల్లా  సంతోష్ సెల్వం, అబ్దుల్లా కూడా తమ విగ్గులలో బంగారాన్ని దాచిపెట్టి, ప్రయాణించేందుకు ప్రయత్నించారు. వీరిని కూడా అరెస్టు చేశారు. వీరు దుబాయ్, షార్జా నుంచి చెన్నైకి వచ్చారు. వీరి వద్ద 2,410 గ్రాముల బరువుగల గోల్డ్ పేస్ట్ ప్యాకెట్లు దొరికాయి.. వారందరూ కూడా షార్జా వెళ్లేందుకు సిద్ధపడటం జరిగింది. వారి విగ్గులలో కూడా 67,500 సౌదీ రియాల్స్, 4,750 అమెరికన్ డాలర్లు, 6,500 దిర్హామ్స్, 8 లక్షల టాకాలు ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.. వీళ్ళ ఐడియాల ముందు పోలీసులు కూడా షాక్ అవుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: