ఇన్ని రోజులు పాన్ కార్డ్‌కు ఆధార్ లింక్‌ చేయాలని చెబుతూ వస్తోంది కేంద్ర సర్కార్. ఇక ఇప్పుడు కేంద్రం కొత్త మార్గదర్శకాలతో డెడ్ లైన్ విధించింది. త్వరలో ఆధార్‌ను పాన్ కార్డ్‌కు లింక్ చేయకపోతే పాన్ కార్డ్ సేవలునిలిచిపోనున్నాయి. పాన్‌ కార్డ్‌కు సంబంధించిన సేవలకు అంతరాయం ఏర్పడనుంది. పాన్‌ కార్డ్‌తో జరిగే లావాదేవీలకు కూడా ఇబ్బందులు ఏర్పడనున్నాయి. అంటే ఇక పాన్‌ కార్డ్‌ ఉన్నా కూడా ఎలాంటి ప్రయోజనం లేనట్లే. పాన్ కార్డును ఆధార్ నెంబర్ లింక్ చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇందుకోసం ఏప్రిల్ 1 వరకు డెడ్ లైన్ విధించింది. ఏప్రిల్ 1 నుంచి ఆధార్ నెంబర్‌ను లింక్ చేయకపోతే పాన్ కార్డ్‌ సేవలు కూడా నిలిచిపోతున్నాయి.

పాన్ కార్డ్‌కు కూడా ఎలాంటి విలువ ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చాలాకాలంగా కోరుతోంది. అనేకసార్లు చివరి తేదీని కూడా పొడిగించింది. ప్రస్తుతం పాన్, ఆధార్ నెంబర్లను లింక్ చేయడానికి 2021 మార్చి 31 చివరి తేదీ విధించింది. అప్పట్లోగా పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేయాలి. ఒకవేళ ఇప్పటికే పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేసినట్లైతే స్టేటస్‌ని ఆన్‌లైన్‌లో తెలుసుకునే విలుంది. ఈ సారి కేంద్ర మార్గదర్శకాలను పాటించకపోతే ఇక ఇబ్బందులు తప్పవు.  


ఒకవేళ గడువు తర్వాత పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేసినట్లైతేన రూ.1,000 లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ గైడ్‌ లైన్స్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఫైనాన్స్ బిల్ 2021 లో నిబంధనను విధించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో పాటు ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి పాన్ కార్డ్ తప్పనిసరి. పాన్ కార్డ్ లేనివాళ్లు సెక్షన్ 139ఏఏ ప్రకారం తమ ఆధార్ నెంబర్‌ను తప్పనిసరిగా వెల్లడించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: