ఇంటర్నెట్ డెస్క్: పాన్ కార్డ్ మీలో చాలా మంది దగ్గర ఉండే ఉంటుంది. ఇక ఆధార్ కార్డయితే అందరి వద్ద ఉండే ఉంటుంది. ఈ రెండు మీ వద్ద ఉన్నాయంటే కచ్చితంగా మీరు భారీ ఫైన్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందే. అయితే ఈ ఫైన్ నుంచి తప్పించుకోవాలంటే మీరు చేయాల్సింది ఒకటే.. అదేంటంటే వెంటనే మీ పాన్-ఆధార్‌లను లింక్ చేయండి. ఒకవేళ ఇప్పటికే చేసి ఉంటే మాత్రం మీరు అదృష్టవంతులే.

పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలని చాలా కాలం నుంచి కేంద్ర ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. దీనికోసం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీఐటీ) అనేకసార్లు పాన్-ఆధార్ లింక్ గడువు తేదీని కూడా అనేక సార్లు పొడిగించింది. ఆఖరి సారి పొడిగించినప్పుడు ఈ గడువును జూన్ 30గా నిర్ణయించారు. దీంతో చాలా మంది ఇప్పటికే ఈ పని పూర్తి చేశారు. కానీ కొంతమంది మాత్రం ఇప్పటికీ ఈ విషయంలో నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. అలాంటి వారికి చెక్ పెట్టేందుకే తాజాగా కేంద్రం ఓ షాకింగ్ ఆదేశాలు జారీ చేసింది. అదేంటంటే జూన్ 30లోగా ఆధార్-పాన్ లింక్ చేసుకోని వారికి పెనాల్టీలు వేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా పాన్ కార్డు చెల్లుబాటును రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

పాన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ చేసుకోకపోతే, అలాంటి వారిపై ఏ స్థాయిలో జరిమానా విధించాలనే అంశం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండడంతో భారీ జరిమానా విధించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961కు సవరణ కూడా చేసింది. సెక్షన్ 234హెచ్‌ను యాడ్ చేసింది. తాజా ఆదేశాల ప్రకారం ఆధార్-పాన్ లింక్ చేసుకోని వారిపై ఆలస్య రుసుము కింద రూ.1000 వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. 2021 ఏప్రిల్ 1 నుంచే ఈ రూల్ అమలులోకి వచ్చింది. అందువల్ల ఎవరైనా ఇప్పటికీ లింక్ చేసుకోకపోతే వెంటనే లింక్ చేసుకోండి. భారీ ఫైన్ నుంచి తప్పించుకోండి

మరింత సమాచారం తెలుసుకోండి: