చంద్రబాబు, వైఎస్సార్.. ఇద్దరి మధ్య ఎంతటి రాజకీయ వైరం ఉందో అందరికీ తెలుసు. వైఎస్సార్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అందరికీ చంద్రబాబు విలన్. అలాగే బాబుని అభిమానించేవావారంతే వైఎస్ఆర్ ని ద్వేషిస్తారు. ఇద్దరినీ కామన్ గా అభిమానించేవారు, ఆరాధించేవారు దాదాపుగా ఎవరూ ఉండరు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి అలాంటి విచిత్రమైన సమస్య వచ్చిపడింది.

రేవంత్ రెడ్డి ఇంకా బాబు భక్తుడే అనే విషయం ఇటీవలే ఏబీఎన్ రాధాకృష్ణతో ఆయన చిట్ చాట్ లీకైన సందర్భంగా మరోసారి రుజువైంది. టీడీపీ గురించి, నారా లోకేష్ భవిష్యత్ గురించి బాబుకంటే ఎక్కువగా రేవంత్ బాధపడినట్టు అర్థమైంది. అంటే కేటీఆర్ అన్నట్టు.. రేవంత్ లో ఇంకా టీడీపీ వాసనలు పోలేదు. కాంగ్రెస్ లో కొనసాగుతున్నా కూడా సీతక్క, రేవంత్ రెడ్డిలాంటి వారికి చంద్రబాబు ఇంకా ఆరాధ్య నాయకుడే. అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఇప్పుడో విచిత్రమైన సమస్య వచ్చి పడింది. వైెస్ఆర్ తనయుడు జగన్ వైసీపీ అనే సొంత కుంపటి పెట్టుకున్నా.. చనిపోయే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడే. ఆయన్ని ఇంకా కాంగ్రెస్ నాయకుడిలాగే ఆ పార్టీ గుర్తిస్తుంది. వైఎస్సార్ ఓటుబ్యాంకు కాంగ్రెస్ తోనే ఉండాలంటే.. అలా గుర్తించాలి కూడా.

ఒకవేళ వైఎస్ఆర్ పాలన గురించి మాట్లాడాల్సి వస్తే ఇప్పుడిక టీకాంగ్రెస్ అధినేతగా ఆయన గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడాలి రేవంత్ రెడ్డి. కచ్చితంగా వైఎస్ పాలన స్వర్ణయుగం అని పొగడాల్సిందే. ఆ విషయంలో టీఆర్ఎస్ శ్రేణుల్ని సైతం ఎదిరించి, వైఎస్ఆర్ పై తమ పార్టీకున్న అభిమానం చాటుకోవాలి. అందులోనూ వైఎస్ఆర్ అనే పేరుతో ఉన్న ఓటుబ్యాంక్ కి షర్మిల రూపంలో మరో పెద్ద అపాయం ఎదురైంది. తెలంగాణలో వైఎస్ అభిమానులంతా షర్మిలవైపు వెళ్లకుండా కాపుకాయాలంటే.. కచ్చితంగా రేవంత్ రెడ్డి సారథ్యంలో టీపీసీసీ ఆయన జపం చేయాల్సిందే. చంద్రబాబు అంటే విపరీతంగా ఇష్టపడే రేవంత్ కి ఇది కాస్త కష్టమైన పనే.

పొరపాటున రేవంత్ రెడ్డి వైఎస్ ను తక్కువచేసి చూసినా, ఆయన విషయంలో తక్కువచేసి మాట్లాడినా ఆయన వర్గం, అనుచరులు ఒప్పుకోరు. రేవంత్ కూడా అదే సామాజికవర్గం అయినా కూడా వైఎస్ ని విమర్శిస్తే ఎవరూ ఊరుకోరు. సో.. ఆ సామాజికవర్గాన్ని కాంగ్రెస్ నుంచి వీడిపోయి షర్మిలతో కలవకుండా చూడాలంటే కచ్చితంగా రేవంత్ రెడ్డి, వైఎస్ఆర్ నామస్మరణ చేయాల్సిందే. చంద్రబాబు భక్తుడికి వైఎస్ఆర్ దేవుడిగా మారడం విధి విచిత్రం కాక ఇంకేంటి..?

మరింత సమాచారం తెలుసుకోండి: