చంద్రశేఖర్ ఆజాద్. బ్రిటిష్ వాళ్లు ఈ పేరు వింటే చాలు గజగజ వణికిపోయేవారు ఎప్పుడు ఎక్కడ తమపై దాడికి పాల్పడతాయోనని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపేవారు. బ్రిటిషర్ల కబంధ హస్తాల నుండి భరతమాతను విడిపించడం కోసం ఎందరో మహనీయులు పోరాటం చేశారు. జైళ్లకు వెళ్లారు. తమ ప్రాణలను అర్పించారు. అలాంటి ముఖ్య వ్యక్తుల్లో చంద్రశేఖర్ ఆజాద్ ఒకరు.

భారతదేశం చంద్రశేఖర్ ఆజాద్ పేరు వింటే ఉప్పొంగి పోతుంది. చంద్రశేఖర్ ఆజాద్ అలహాబాద్ లో జన్మించారు. 1903 జులై 23వ తేదీన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. వీరిది సాధారణ మధ్యతరగతి కుటుంబం. చంద్రశేఖర్ ఆజాద్ ను అందరూ పిలుచుకునే పేరు చంద్రశేఖర్ సీతారామ్ కేసరి. ఆయన తల్లి మాత్రం అతడిని సంస్కృతంలో పెద్ద పండితుడు కావాలని ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంది. కానీ చంద్రశేఖర్ ఆజాద్ కు చదువు మీద అంతగా ఆసక్తి లేదు. తల్లిదండ్రులు చదువుకోవాలని తనపై ఒత్తిడి చేస్తుంటే తట్టుకోలేకపోయాడు. తనకు 13సంవత్సరాలు ఉన్నప్పడే ఎవరికీ చెప్పాపెట్టకుండా ముంబైకి వెళ్లిపోయాడు. అక్కడ ఆ చిన్న వయసులో కూలీ పనిచేసుకుంటూ పొట్టపోసుకున్నాడు.  

తర్వాత కూలీపనిలో పడే కష్టం కన్నా చదువే మేలు అని గ్రహించి తిరిగి ఇంటికొచ్చేశాడు. 1921స్కూల్లో చేరడంత  పాటు.. గాంధీ నిర్వహిస్తున్న సహాయనిరాకరణ ఉద్యమలో చురుగ్గా పాల్గొన్నాడు. దాంతో పోలీసులు ఆయనకు సంకెళ్లు వేసి జైలుకు తరలించారు. కోర్టకు హాజరైన ఆయన న్యాయవాదులు అతడిని అడిగిన ప్రశ్నలకు ఆశ్చర్యపరిచే సమాధానం ఇచ్చాడు. తన పేరు ఆజాద్ అనీ.. తన తండ్రిపేరు స్వాతంత్ర్యం అనీ.. తాము జీవించేది కటకటాల్లో అంటూ వింతగా చెప్పాడు.  

దీంతో న్యాయవాదులు అతడికి 15రోజులు జైలు జీవితంతో పాటు.. 15కొరడా దెబ్బలను శిక్ష వేశారు. తర్వాత కటకటాల నుంచి విడుదల అయిన తర్వాత భగత్ సింగ్ లాంటి మహామహులతో కలిసి పోరాటంలో పాల్గొన్నారు. ముఖ్యంగా 1925వ సంవత్సరంలో కకోరి రైలు దోపిడీతో ఆజాద్ పేరు దేశం అంతా మార్మోగిపోయింది. 1929లో లాలాలజపతి రాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ ఆఫీసర్ స్కాట్ మర్డర్ కు ప్లాన్ పేశారు ఆజాద్. తొలిసారి ఆయన వేసిన ప్రణాళిక విఫలమైంది.

సాండర్స్ ను స్కాట్ అనుకొని తుపాకీతో కాల్చి చంపేశారు ఆజాద్. శత్రువులకు ఈ ఆజాద్ భయపడేది లేదనీ.. వారి ప్రాణం తన చేతుల్లోనే ఉందని చేసిన నినాదం అందరిలో ఉత్తేజాన్ని నింపింది. ఆజాద్ అవిశ్రాంత పోరాట యోధుడిగా పేరొందారు. అతనికి క్విక్ సిల్వర్ అని పేరు కూడా ఉంది. 1931వ సంవత్సరం ఫిబ్రవరి 27వ తేదీన ఆజాద్ పై పోలీసులు దాడులు జరిపారు. తనతో సమావేశమైన సుఖ్ దేవ్ మాత్రం అక్కడి నుంచి తప్పించుకునే వారకు పోలీసులతో పోరాడాడు. చివరకు తానే రివాల్వర్ తో ప్రాణాలు తీసుకున్నాడు. నేడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి. ఆయన ప్రజల్లో దేశభక్తిని పెంపొందించాడనడంలో ఏ మాత్రం సందేహం లేదు. 








 

మరింత సమాచారం తెలుసుకోండి: