ఊబకాయం పెద్ద వారినే కాదు.. చిన్నారులను కూడా వ‌దడం లేదు. మాములుగా రెండెళ్ల చిన్నారి 12 నుంచి 15 కిలోల బ‌రువు ఉండాలి. కాని ఓ పాప‌యికి పెద్ద క‌ష్టం వ‌చ్చింది. ఆమె ఏకంగా 45 కిలోల బ‌రువు ఉంది. దీంతో ఆ చిన్నారికి ఆరుదైన శ‌స్త్ర చికిత్స చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఖ్యాతీ వ‌ర్షిణి అనే రెండేళ్ల చిన్నారికి ఊబ‌కాయం భారం ప‌డింది. ఆమె ఈ స‌మ‌స్య‌తో అడుగులు కూడా వేయ‌డానికి ఇబ్బంది ప‌డేది. ప‌డుకోవ‌డంలోను క‌ష్టంగా ఉండేది. దీంతో ఆ చిన్నారికి అరుదైన శ‌స్త్ర చికిత్స‌ను చేసి కొవ్వు తీసేశారు. అత్యంత క్లిష్ట‌మైన బేరియాట్రిక్ విధానం ద్వారా స‌ర్జ‌రీ చేసి కొవ్వును తీసివాశారు. ఢిల్లిలోని ప‌త్‌ప‌ర్‌గంజ్‌లోని మాక్స్ సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ వైద్యులు ఈ అరుదైన ఆప‌రేష‌న్‌ను విజ‌యవంతంగా పూర్తి చేశారు. బేరియాట్రిక్‌ సర్జరీ విధానంతో ఆకలి మందగించి తీసుకునే ఆహారం తగ్గి, బరువు కూడా తగ్గిపోతారు.

 ఎంద‌రో దంపతుల‌కు పిల్ల‌లు లేక భాధ‌ప‌డుతున్నారు. కొంద‌రికి లేక లేక పిల్ల‌లు పుట్టిన వారికి ఎన్నో స‌మ‌స్య‌లు ఏర్ప‌డుతున్నాయి. పుట్ట‌డంతోనే శ‌స్త్ర‌చికిత్స‌లు చేయాల్సి వ‌స్తోంది. ఎక్కువ శాతం చిన్న‌పిల్ల‌లో గుండెకు హోల్ ప‌డింది, కామెర్లు, ర‌క్త‌హీన‌త ద్వారా ఇబ్బంది ప‌డుతుంటారు. కాని వ‌ర్షిణీకి ఈ ఊబ‌కాయం స‌మ‌స్య ఏర్ప‌డింది. ఆమె మాములుగా పుట్టిన‌పుడు రెండు కిలోలు బ‌రువు ఉంది. కానీ ఆరు నెల‌ల పూర్త‌య్యే స‌రికి ఏకంగా 14 కిలోల బ‌రువు పెరిగిపోయింది, ఆ త‌రువాత రెండేళ్లు నిండే స‌రికి ఏకంగా 45 కిలోల బ‌రువు  పెరిగిపోయింది వ‌ర్షిణి. దీంతో పాప ఆరోగ్యం  మ‌రింత‌గా దిగ‌జారుతుండ‌డంతో వైద్యులు శ్ర‌మించి ఈ బేరియాట్రిక్ స‌ర్జ‌రీ చేయాల్సి వ‌చ్చింద‌ని పీడియాట్రిక్ ఎండోక్రినాల‌జీ క‌న్స‌ల్టెంట్ మ‌న్‌ప్రీత్ సేథి వివ‌రించారు.



  అయితే, భార‌త దేశంలో అత్యధికంగా బరువు పెరిగి, బరువును తగ్గేందుకు శాస్త్ర చికిత్స చేయించుకున్న అతి పిన్నవయస్కురాలిగా చిన్నారి వ‌ర్షి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. స‌ర్జ‌రీ జరిగిన అనంత‌రం  ఐదు రోజుల తర్వాత, చిన్నారి పరిస్థితి బాగా మెరుగు పడిందని, ప్రధాన లక్షణాలలో ఒకటైన గురక పూర్తిగా ఆగిపోయిందని అనిష్టీషియా వైద్యుడు అరుణ్ పురి వెల్ల‌డించారు. ఊబకాయంతో బాధపడుతున్న ఇతర పిల్లలకు భవిష్యత్తులో ఇలాంటి శస్త్రచికిత్సలు చేయడానికి మార్గం మరింత సుగమమైందని ఈ సంద‌ర్భంగా అరుణ్ పురి పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: