కేంద్రంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం దేశంలో ఉన్న అన్ని ప్ర‌భుత్వ ఆస్తు ల‌ను ఆమ్మెయాల‌ని చూస్తున్న‌ట్టు ఉంది. ఇప్ప‌టికే చాలా ప్ర‌భుత్వ రంగ సంస్థ ల‌ను ప్ర‌యివేటు వ్య‌క్తుల‌కు అప్ప జెప్పింది. అంతే కాకుండా ఇంకా చాలా ప్ర‌భుత్వ ఆస్తుల‌ను అమ్మెయాల‌ని చూస్తున్న‌ట్టు ఉంది. దీనీపై ఇంత కు ముందే మ‌న దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మాల సీత రామ‌న్ కూడా గ‌తం లో ఒక ప్ర‌క‌ట‌న కూడా చేశారు. ఆ ప్ర‌క‌ట‌న‌లో కొన్ని రైల్వే స్టేష‌న్ లు, రైల్వే ట్రాక్ ల తో పాటు కొన్ని విమానాశ్ర‌యాలను విక్ర‌యించ‌డానికి త‌మ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని చెప్పింది. వీటిని అమ్మెయాడానికి కార‌ణం ఆయా సంస్థ‌లు న‌ష్టాల‌లో ఉన్నాయ‌ని వారు చెబుతున్నారు.



తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎకైక అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాన్ని పూర్తిగా ప్ర‌యివేటు వ్య‌క్తుల చేతు ల్లో పెట్టడానికి రంగం సిద్ధం చేసింది. దానికి సంబంధించిన కార్య‌చ‌ర‌ణ ను కూడా సిద్ధం చేసుకుంది. ఒక హైద‌రాబాద్ విమానాశ్ర‌యం కాకుండా మ‌రో మూడు విమానాశ్ర‌యాల‌ల్లో కేంద్ర ప్ర‌భుత్వానికి ఉన్న వాట‌ను అమ్మెయాల‌ని చూస్తుంది. ఆయా విమానాశ్ర‌యాల్లో క‌రోనా కార‌ణంగా చాలా న‌ష్టాలు వ‌చ్చాయ‌ని అందుకే వీటి భాద్య‌త నుంచి కేంద్ర ప్ర‌భుత్వం త‌ప్పుకోవాల‌ని చూస్తుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం చెబుత‌గుంది. అయితే కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న ఈ  నిర్ణ‌యాన్ని అన్ని ప్ర‌తిప‌క్ష పార్టీలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి. కేవ‌లం ప్ర‌యివేటు వ్య‌క్తుల బాగు కోస‌మే బీజేపీ ప్రభుత్వం విమానాశ్ర‌యాల‌ను విక్ర‌యిస్తుంద‌ని ఆరోపిస్తున్నారు.



అయితే అప్ప‌ట్లో కేంద్రంలో ఉన్న కాంగ్రేస్ ప్ర‌భుత్వం అన్ని రాష్ట్రాల‌లో అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాలు ఉండాల‌ని ప‌బ్లిక్ అండ్ ప్ర‌యివేటే పాల‌సీ ని పాటించింది. దీని ప్ర‌కారం అన్ని రాష్ట్రాల‌లో ప్ర‌యివేటు వారి చేత విమానాశ్ర‌యాలు ఏర్పాటు చేసి అందులో కొంతం శాతం కేంద్ర ప్ర‌భుత్వ ఆధీనంలో ఉండే విధంగా చూసింది. కానీ నేటి బీజేపీ ప్రభుత్వం వాటి బాధ్య‌త ల నుంచి త‌ప్పుకుని ప్ర‌యివేటు వ్య‌క్తుల‌కు క‌ట్ట బెడుతుంది.  ఇలా ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను ప్ర‌యివేటు వ్య‌క్తుల‌కు అమ్మెస్తే బీజేపీ ప్ర‌భుత్వం ప్ర‌జా ఆగ్ర‌హానికి గురి కాక త‌ప్ప‌ద‌ని దేశ ప్ర‌జ‌లు అంటున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: