మనదేశంలో చాలా రకాల కాలుష్యాలు జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకునే వాటిలో ధ్వని కాలుష్యం కూడా ఒకటి. అయితే మన దేశంలో రోడ్లపై తిరిగే వాహనాల సంఖ్య ఎక్కువ. వాటినుండి వచ్చే ధ్వని కాలుష్యం కూడా ఎక్కువే. అయితే దీనిని నిర్మూలించడానికి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఓ వినూత్న ఆలోచన తో వస్తున్నారు. అది ఏంటంటే మన దేశంలో తిరిగే వాహనాలకు ప్రస్తుతం హారన్ కొడితే వచ్చే సౌండ్ తీసేసి దాని స్థానంలో మన భారతీయ సంగీత వాయిద్యాల సౌండ్ ను ఉంచాలని ఆయన కొత్త చట్టాన్ని తీసుకు రాబోతున్నట్లు తెలిపారు. అయితే అంబులెన్స్ పోలీసు వాహనాలు కూడా ఇది వర్తిస్తుందని.. వాటి హారన్ స్థానాలలో ఓ ఆహ్లాదకరమైన హారన్ ధ్వనిని ఉంచాలని దానికి సంబంధించిన కొన్ని ట్యూన్స్ ను ఇప్పుడు తాను పరిశీలిస్తున్నట్లు ఓ హైవే ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న నితిన్ గడ్కరీ స్వయంగా తెలిపారు. అయితే ఇప్పటికే ఓ మ్యూజిషియన్ ఒక ట్యూన్ కంపోజ్ చేసాడని... దానిపై ప్రస్తుతం పరిశీలనలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ కొత్త చట్టం ఎప్పటి నుండి అమలులోకి వస్తుంది అనేది తెలియడం లేదు. ఒకవేళ అమలులోకి వచ్చిన ఇప్పటివరకు ఉన్న వాహనాలలో హారన్ సౌండ్ ను ఎలా మార్చుతారు అనే దాని పైన ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం రోడ్ల పై వాహనాలు చేసే హారన్ సౌంద మాత్రం ప్రజలకు విసుగును తెప్పిస్తుంది అనడంలో సందేహం లేదు.

ఇక అనంతరం రోడ్డు ప్రమాదాల గురించి మాట్లాడిన ఆయన ముంబై - పూణే హైవే లో ప్రమాదాలు 50 శాతం తగ్గాయని.... తమిళనాడులో కూడా రోడ్డు ప్రమాదాలు అలాగే వాటి వల్ల సంభవించే మరణాలు కూడా 50 శాతం తగ్గాయని చెప్పారు. కానీ మహారాష్ట్రలో అలాంటి విజయాన్ని సాధించలేకపోయాయి. అంతేకాక మహారాష్ట్రలో ప్రమాదాల కారణంగా మరణించే వారి సంఖ్య పెరిగిందని అన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: