క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కేసీయార్ ను శాండ్ విచ్ చేసేస్తున్నదెవరయ్యా అంటే కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ చీఫ్ బండి సంజయ్. తెలంగాణా బీజేపీకి అద్యక్షుడుగా బండి బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి పార్టీలో బాగా దూకుడుపెరిగింది. ఎక్కెడక్కడి నేతలు ఏకమవుతున్నారు. కేసీయార్ కు వ్యతిరేకంగా రెచ్చిపోతున్నారు. పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తల్లో స్పీడు పెరిగింది.




దీనికితోడు దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించటంతో కమలనాదులు రెచ్చిపోతున్నారు. ఇదే సమయంలో ఒకటిరెండు ఓటములున్నా పార్టీ శ్రేణులైతే బండి నాయకత్వంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగానే పోరాడుతున్నారు. రేపటి ఎన్నికల్లో ఫలితాలు ఎలాగుంటుందో తెలీదు కానీ అధికారంలోకి వచ్చేది తామే అంటు బీజేపీ నేతలు రెచ్చిపోతున్నారు. దాంతో కేసీయార్ తో పాటు మంత్రులు, ప్రజా ప్రతినిదులకు బీజేపీ సెగ బాగా తగులుతోంది.




బండి విషయాన్ని పక్కనపెడితే కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి పగ్గాలు అందుకున్నారు. ఎప్పుడైతే రేవంత్ బాధ్యతలు తీసుకున్నారో అప్పటినుండి కేసీయార్ టార్గెట్ గా రెచ్చిపోతున్నారు. రేవంత్ బాధ్యతల తర్వాత అంతకుముందు స్తబ్దుగా ఉన్న చాలామంది నేతలు యాక్టివేట్ అయ్యారు. దాంతో కార్యకర్తల్లో మంచి హుషారు వచ్చేసింది. అంటే ఒకవైపు రేవంత్ మరోవైపు బండి వరసబెట్టి కేసీయార్ ను గట్టిగా తగులుకుంటున్నారు. తాజాగా కేసీయార్ వ్యవసాయ క్షేత్రం ఎర్రవల్లికి టూర్  పెట్టుకున్న రేవంత్ ను పోలీసులు అరెస్టు చేయటం పెద్ద వివాదంగా మారింది.



ఇదే సమయంలో పార్టీ ఆఫీసులో బండి ఆధ్వర్యంలో నిరుద్యోగదీక్ష జరిగింది. నిజానికి ఇందిరా పార్కు దగ్గర దీక్ష చేయాలని అనుకుంటే పోలీసులు అనుమతించలేదు. దాంతో పార్టీ ఆఫీసులోనే దీక్ష చేశారు. దీనికి మంచి స్పందనే వచ్చింది. వీళ్ళిద్దరు కేసీయార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి వారం ఏదో ప్రోగ్రామ్ తీసుకుని నానా గోల చేస్తున్నారు. వీళ్ళని తట్టుకోవటం నిజంగా కేసీయార్ తో పాటు ఆయన మంత్రివర్గానికి పెద్ద తలనొప్పిగా తయారైంది. అందుకనే రేవంత్-బండి మధ్య కేసీయార్ శాండ్ విచ్ అయిపోతున్నారనే సెటైర్లు పేలుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: