ప్రస్తుతం భారత్లో ప్రముఖ విమానయాన సంస్థల్లో ఒకటిగా కొనసాగుతుంది ఇండిగో సంస్థ. ఇక ఎప్పుడూ తమ ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్లు ప్రకటించడం లో ముందు ఉంటుంది. ఇక ఇండిగో ప్రకటించే ఎన్నో ఆఫర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ఎంతో మంది ప్రయాణికులను ఆకర్షిస్తూ ఉంటాయి. అయితే కరోనా వైరస్ కారణం గా వాక్సినేషన్ ప్రక్రియ ఎంతో తప్పనిసరిగా మారిపోయింది. ఎంతో మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేసుకుంటూ ఉంటే కొంతమంది మాత్రం కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో వ్యాక్సిన్ వేసుకునే వాళ్లను మరింత ప్రోత్సహించేందుకు సరికొత్త ఆఫర్ను తీసుకువచ్చింది ఇండిగో.


 వ్యాక్సి ఫేర్ అనే ఒక బంపర్ ఆఫర్ను ప్రకటించింది ఇండిగో. కోవిడ్ 19 వ్యాక్సిన్ లో ఫస్ట్ సెకండ్ డోస్ లు తీసుకున్న ప్రయాణికులకు బేస్ ప్రైజ్ పై పది శాతం తగ్గింపు అందిస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది. అయితే భారతదేశంలో ఉన్న టీకాలు వేసుకున్న ప్రయాణికులు మాత్రమే ఈ ఆఫర్ ను పొందవచ్చు అంటూ ఒక నిబంధన పెట్టింది. ప్రస్తుతం ఒకవైపు మహమ్మారి కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయం లో విమాన ప్రయాణాలను కూడా పెంచే ప్రయత్నంలో భాగంగానే ఇండిగో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది

 ఇక ఈ విషయాన్ని అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ప్రకటించింది ఇండిగో.  అందరూ టీ కాలు వేసుకుని ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారా వ్యాక్సి ఫేర్ లో టికెట్ బుక్ చేసుకోండి సద్వినియోగం చేసుకోండి అంటూ ఎయిర్లైన్స్ సంస్థ చెప్పుకొచ్చింది. ఇక ప్రయాణికులు తమ వెంట వ్యాక్సిన్  సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రయాణికులు టీకా వేసుకున్నట్లు ఎయిర్పోర్ట్ ఇన్ కౌంటర్ లో ఆరోగ్య సేతు మొబైల్  యాప్ లో చూపించాల్సి ఉంటుంది   లేనిపక్షంలో ఇక ఇండిగో ప్రకటించిన ఆఫర్ మాత్రం వర్తించదు అని చెప్పాలి.  వెబ్సైట్ ప్రకారం టికెట్లు బుక్ చేసుకున్న తేదీ నుంచి 15 రోజుల కంటే ఎక్కువ ప్రయాణానికి వ్యాక్సి ఫేర్ ఆఫర్ ద్వారా తగ్గింపు లభిస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: