మోడీ పరిపాలన ఇప్పటి వరకు ఏడున్నర సంవత్సరాలు అయింది. ఈ ఏడున్నరేళ్లలో మోడీ 70 లక్షల కోట్లకు పైగానే అప్పులు చేశారు.ఇక అంతకుముందు.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వాలు చేసిన అప్పులు.. 40 లక్షల కోట్లు వున్నాయి. కానీ ప్రధాని మోడీ హయాంలో మాత్రం ఏడున్నరేళ్లలోనే 70 లక్షల కోట్లు అప్పులు చేశారు.ఇక ఏపీలో జగన్ ప్రభుత్వం పాలన రెండున్నరేళ్లు మాత్రమే పూర్తయింది. అయితే.. ఈ రెండున్న రేళ్లలో.. జగన్ మోహన్ రెడ్డి ప్రబుత్వం ఏకంగా 3.50 లక్షల కోట్లు అప్పులు చేసింది. గత ప్రభుత్వాలు అన్నీ కలిపి చేసిన అప్పులు.. కేవలం 3 లక్షల కోట్లు మాత్రమే వున్నాయి. అంటే..ఇక జగన్ కేవలం రెండున్నరేళ్లలోనే.. మొత్తం మూడున్నర లక్షల కోట్ల అప్పులు చేశారు.ఇక మోడీ విపక్ష కాంగ్రెస్ ని ఎంతగా అణిచి వేయాలో అంతా అణిచి వేస్తున్నారు. ముఖ్యంగా దేశంలో ఇందిరమ్మ రాజీవ్ గాంధీల పేర్లతో ఉన్న పథకాలను కూడా మోడీ దాదాపు నిలిపివేశారు. అంతేకాదు  ఒకవేళ ఆ పథకాలను లేదా ప్రాజెక్టులను కొనసాగించక తప్పదని భావిస్తే.. ఇక వాటికి ఉన్న పేర్లను కూడా మార్చేస్తున్నారు.

అత్యంత కీలకమైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం పేరును కూడా ధ్యాన్ చంద్ పేరిట ఆయన మార్చేశారు. ఇక అదేవిధంగా కాంగ్రెస్ హయాంలో ఏర్పాటు చేసిన అమర జ్యోతిని కూడా మార్చేశారు. ఇలా.. అనేక పథకాలకు పేర్లను  మోడీ మార్చేశారు. ఇందిరా వికాస్ పత్రాలను ఇక నేషనల్ సెక్యూరిటీ పత్రాలుగా కూడా ఆయన మార్చేశారు.జగన్ విషయానికి వస్తే..ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పార్టీపై తన ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ పార్టీ ప్రభుత్వం ప్రారంభించిన అనేక సంక్షేమ పథకాలను కూడా ఆయన నిలిపివేశారు. కీలకమైన అన్న క్యాంటిన్లను కూడా ఆపివేశారు. ముస్లింలకు ఇచ్చే చంద్రన్న తోఫా సహా అన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా జగన్ నిలిపివేశారు. టీడీపీ హయాంలో నిర్మించిన భవనాలను కూడా జగన్ కూల్చేశారు.ఇక పాపం చంద్రబాబు హయంలో ప్రతిపాదించిన రాజధానిని పక్కన పెట్టారు. ఇక ఇలా.. అనేక రూపాల్లో విపక్షం అనే పేరు వినిపించకూడదు.. అనే రేంజ్లో ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి పాలన చేస్తుండడం గమననార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: