అవును కేసీఆర్‌కు చెక్ పెట్టే విషయంలో బండి సంజయ్ ఏ మాత్రం సరిపోవట్లేదు...అసలు కేసీఆర్‌కు ధీటుగా నిలబడి..ఆయనని నిలువరించడంలో బండి సత్తా చాలట్లేదు. ఇంతకాలం కేసీఆర్ కాస్త చూసి చూడనట్లుగానే రాజకీయం చేశారు. దీంతో తెలంగాణలో బీజేపీ దూకుడు పెరిగింది...ఓ రేంజ్‌లో బీజేపీ, కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి దూకుడు ప్రదర్శించింది. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం...ఓ ఫైర్ బ్రాండ్ నాయకుడు మాదిరిగా తయారయ్యి...కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేయడం స్టార్ట్ చేశారు..ప్రజా సమస్యలపై స్పందిస్తూ, వాటిపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

అలాగే రాజకీయంగా కూడా బీజేపీని బలోపేతం చేయడంలో ముందున్నారు...ఇలా బండి స్పీడ్ పెరుగుతూ వచ్చింది. కానీ ఒక్కసారిగా కేసీఆర్ ఎంట్రీ ఇచ్చి, బీజేపీని టార్గెట్ చేసి రాజకీయం చేయడంతో సీన్ రివర్స్ అయింది. ఇప్పటివరకు అంటే బీజేపీకి టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కౌంటర్లు ఇస్తూ వచ్చారు. కానీ ఆ కౌంటర్లు బీజేపీని ఆపలేకపోయాయి..ఎప్పుడైతే కేసీఆర్ ఎంట్రీ ఇచ్చారో అప్పటినుంచి తెలగాణ పోలిటికల్ సీన్ మారింది.

ఒక్కసారిగా కేసీఆర్...కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్‌ని టార్గెట్ చేసి రాజకీయం మొదలుపెట్టారు...తెలంగాణకు మోదీ పెద్ద విలన్ అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు...దీంతో రాష్ట్రంలో ఉండే బీజేపీ నేతలది సైడ్ క్యారెక్టర్ అయిపోయింది. అంటే తెలంగాణ బీజేపీలో కేసీఆర్‌ స్థాయిలో ఢీకొట్టే నాయకుడు లేరా? అనే అంశం వచ్చింది.

వాస్తవానికి కేసీఆర్ లాంటి నేతకు బండి సంజయ్ ఏ మాత్రం సరిపోరు...కేసీఆర్‌తో పోలిస్తే బండి కెపాసిటీ తక్కువ. పోనీ కేసీఆర్‌తో సమానంగా ఉండే నాయకులు ఉన్నారా? అంటే కొద్దో గొప్పో కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ లాంటి వారు ఉన్నారు..కానీ వారేమో రాజకీయంగా దూకుడుగా ఉండటం లేదు. ఇటు ఏమో కేసీఆర్‌కు ధీటుగా రాజకీయం చేయడంలో బండి వెనుకబడ్డారు. దీంతో రాజకీయంగా బీజేపీ సైతం వెనుకబడేలా ఉంది...అంటే బండి సంజయ్ ఇంకా స్పీడ్ పెంచితేనే కేసీఆర్‌ని అందుకోగలరు...లేదంటే అంతే సంగతులు.


మరింత సమాచారం తెలుసుకోండి: