ఇటీవలే మిలటరీ ఆపరేషన్ అంటూ చెప్పిన రష్యా ఉక్రెయిన్ పై పూర్తిస్థాయి యుద్ధాన్ని చేస్తోంది.ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉక్రెయిన్ అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. అయితే రష్యా తో పోల్చి చూస్తే ఉక్రెయిన్ చిన్నదేశం అయినప్పటికీ ఎంతో వీరోచితంగా పోరాడుతూ రష్యా సేనలను నిలువరిస్తూ ఉండటం గమనార్హం. ఇక యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం ఉక్రెయిన్లో విమానం సర్వీసులు అన్ని కూడా నిలిచిపోయాయి. ఇలాంటి సమయంలో ఇక ఉక్రెయిన్ లో ఇరుక్కుపోయిన భారతీయులందరినీ కూడా మళ్లీ స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి అనే విషయం తెలిసిందే.


 దాదాపు 1600 మంది భారతీయులు ఉక్రెయిన్లో చిక్కుకున్నట్లు విదేశాంగ శాఖ గుర్తించింది. అయితే వీరిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే వారిని రక్షించే త్వరగా స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వరుసగా విమానాలలో పౌరులను స్వదేశానికి తీసుకు వస్తున్నారు.  ఆపరేషన్ గంగా కింద ఇక ఇలా ఉక్రెయిన్ లో ఇరుక్కుపోయిన భారతీయులను ఇండియా కు తీసుకువచ్చారు  అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల కేంద్ర మంత్రులు అందరితో కలిసి అత్యవసర సమావేశం నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోడీ.


 ఇక భారత విద్యార్థులపై జరిగిన దాని గురించి ఈ సమావేశంలో చర్చించారు అని తెలుస్తోంది. ఈ క్రమంలోనే భారతీయ విద్యార్థులను కాపాడేందుకు ఉక్రెయిన్ దేశాలకు కేంద్ర మంత్రులు వెళ్లాలని ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.. విద్యార్థుల తరలింపు ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించాలని మోదీ ఆదేశాలు జారీ చేశారు.. ఈ క్రమంలోనే రొమేనియా హంగేరి పోలాండ్ దేశాలకు కేంద్ర మంత్రులు వెళ్లనున్నారు.. ఇక కేంద్ర మంత్రులు అందరూ ఒక్కసారి ఉక్రెయిన్ సరిహద్దుల్లోకి వెళ్ళబోతూ ఉండడం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. కాగా ఆపరేషన్ గంగా లో భాగంగా ఇప్పటికే వరుసగా విమానాలు ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులను  కూడా స్వదేశానికి తీసుకు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: