మంత్రులుగా బాధ్యతలు తీసుకుని ఎన్నోరోజులు కాలేదు.  ఇంతలోనే కొందరు మంత్రులు అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్నారు. అలాంటివారిలో ముగ్గురు మంత్రులు గుడివాడ అమర్నాద్, అంబటి రాంబాబు, దాటిశెట్టి రాజాల వైఖరి ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళు ముగ్గురు మంత్రులుగా బాధ్యతలు తీసుకోవటం ఆలస్యం వెంటనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విరుచుకుపడటం మొదలుపెట్టారు.





మంత్రులుగా బాధ్యతలు తీసుకున్న వారు తమ శాఖలపై సమీక్షలు పెట్టుకోవటం, విషయ పరిజ్ఞానం పెంచుకోవటం, క్షేత్రస్ధాయిలో పర్యటనలు చేయటం లాంటివి చేయటంలేదు. పవన్ పై ఆరోపణలు, విమర్శలు చేయటం కోసమే తాము మంత్రులయ్యామన్న పీలింగ్ లో ఉన్నట్లున్నారు. అందుకనే అర్జంటుగా ప్రెస్ మీట్లు పెట్టి శాఖలు గురించి మాట్లాడుతునే పనిలో పనిగా పవన్ పైన కూడా నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. అనవసరంగా మాట్లాడటం వల్ల తామే పవన్ కు ప్రచారం కల్పిస్తున్నామన్న విషయాన్ని మంత్రులు మరచిపోతున్నారు.






ఇక్కడ వీళ్ళు మరచిపోయిన విషయం ఏమిటంటే తాము అనవసరంగా పవన్ కు ప్రచారం కల్పిస్తున్నామని. పవన్ గురించి ఇప్పటికే జనాలకు ఒక ఐడియా ఉంది. వాస్తవానికి ఏ విషయంలో కూడా పవన్ కు స్ధిరమైన అభిప్రాయం ఉండదు. ఏ సబ్జెక్టులో కూడా విషయ పరిజ్ఞానం లేదని జనాలకు ఎప్పుడో తెలుసు. ఈరోజు మాట్లాడే మాటకు తర్వాత భిన్నంగా మాట్లాడిన సందర్భాలు ఎన్నోఉన్నాయి.






అలాంటి పవన్ ఎక్కడైనా సభలు పెట్టుకుని జగన్ గురించో లేకపోతే ప్రభుత్వం గురించో నోటికొచ్చినట్లు మాట్లాడితే మాట్లడచ్చు. దానికి వెంటనే మంత్రులు రియాక్టపోయి పవన్ పై విరుచుకుపడాల్సిన అవసరంలేదు. ఎందుకంటే పవన్ మాట్లాడిందాన్ని జనాలు పెద్ద సీరియస్ గా తీసుకోవటంలేదు. ఇంతోటిదానికి మంత్రులు ఒకటికి పదిసార్లు పవన్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది ? మంత్రులతో తనను తిట్టించుకోవటమనే టార్గెట్లో పవన్ సక్సెస్ అయినట్లున్నారు. కాబట్టి తామే పవన్ కు అనవసరంగా ప్రచారం కల్పిస్తున్న విషయాన్ని ఇప్పటికైనా మంత్రులు గ్రహించాలి. పవన్ కు ప్రచారం కల్పించటంలో చూపించే అత్యుత్సాహం తమ శాఖలపై పట్టుసాధించటంపై దృష్టిపెడితే బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: