ఇటీవల తెలంగాణలో మద్యం రేట్లు భారీగా పెరిగాయి. దీంతో మందుబాబుల్లో హుషారు కాస్త తగ్గింది. ఒకరకంగా వేసవిలో బీర్ల అమ్మకాలు భారీగా పెరగాల్సి ఉన్నా, రేట్లు పెరగడంతో అనూహ్యంగా తగ్గాయి. పెరిగిన ధరల వల్లే అమ్మకాలు తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు నిర్వాహకులు. విచిత్రం ఏంటంటే.. అమ్మకాలుత గ్గినా ఆబ్కారీ శాఖ ఆదాయం మాత్రం పెరిగింది. తెలంగాణలో అన్ని రకాల బీర్లు, మందు బాటిళ్లపై ప్రభుత్వం కనిష్టంగా రూ. 20 నుంచి గరిష్టంగా రూ.160 వరకు ధరలు పెంచింది. ఒక్కో బ్రాండ్‌ ధర ఒక్కో విధంగా పెంచుకుంటూ పోయింది ప్రభుత్వం. దీంతో సాధారణ, మధ్యతరగతి ప్రజలపై కూడా భారం పడింది. కేవలం ప్రీమియం బ్రాండ్లనే కాకుండా ఇతర అన్నిరకాల మద్యం బ్రాండ్లపై కూడా పెంపు భారం పడింది. దీంతో పెరిగిన ధరలు ప్రజలను నిరాశకు గురి చేశాయి.

అమ్మకాలు ఇలా తగ్గాయి..
ధరల పెరుగుదలకు ముందు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సుమారు లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. ధరలు పెరిగిన తర్వాత మే 19 నుంచి మే 28 వరకు 10రోజుల వ్యవధిలో కేవలం  3.6 లక్షల కేసుల బీర్లు మాత్రమే అమ్ముడుపోయాయి. అంటే 40  వేల కేసుల వరకు  బీర్ల అమ్మకాలు తగ్గాయని అర్థమవుతోంది. ఇక గ్రేటర్‌ పరిధిలో అత్యధికంగా మద్యం విక్రయాలు జరిగాయి. ఇక్కడ కూడా బీర్ల అమ్మకాలు తగ్గాయి. రంగారెడ్డి జిల్లాలో ధరల పెంపుకి ముందు 1.86 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిగాయి. ధరల పెంపు తర్వాత 1.84 లక్షల కేసుల మద్యం అమ్ముడుపోయింది. అంటే మద్యం అమ్మకాలు స్వల్పంగా తగ్గాయని తెలుస్తోంది.

హైదరాబాద్, మేడ్చల్‌  ఎక్సైజ్‌  జిల్లాల పరిధిలో కూడా ధరల పెంపు ప్రభావం అమ్మకాలపై కనపడుతోంది. పెరిగిన ధరల కారణంగా మద్యం వినియోగం కొంత మేరకు తగ్గిందని వైన్‌ షాపుల  నిర్వాహకులు చెబుతున్నారు. వేసవి ప్రభావం ఇంకా తగ్గకపోయినా బీర్ల అమ్మకాలు మాత్రం తగ్గాయి. వేసవిలో బీర్ల అమ్మకాలు పెరుగుతూ పోవాలి కానీ, ఇలా తగ్గడమేంటని ఆశ్చర్యపోతున్నారు.

మరోవైపు లిక్కర్ ధరలు పెరగడంతో అమ్మకాలు తగ్గాయి, అమ్ముడుపోయిన కేసుల సంఖ్య తగ్గింది.. అయితే అదే సమయంలో సర్కారుకి ఆదాయం మాత్రం భారీగా పెరిగింది. మే 8వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు గ్రేటర్‌ పరిధిలోని మూడు జిల్లాలలో మద్యం అమ్మకాల ద్వారా రూ.315 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. మే 19నుంచి మే 28 వరకు పది రోజుల వ్యవధిలో రూ.351 కోట్లకు ఆదాయం పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: