ఇటీవలి కాలం లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఎంతలా దంచి కొడుతున్నాయో ప్రత్యేకం  గా చెప్పాల్సిన పనిలేదు. ఇక భారీ వర్షాల నేపథ్యం లో వాగులు వంకలు నిండడం కాదు ఏకంగా భారీ ప్రాజెక్టులను సైతం నిండుకుండలా మారి పోయాయి. ఎన్నో ప్రాంతాలు వరదల్లో చిక్కుకు పోయాయ్ అని చెప్పాలి. ఇలాంటి సమయం లోనే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే కొన్ని ప్రాంతాలలో మాత్రం వర్షాలు తగ్గుముఖం పట్టడం నేపథ్యంలో మొన్నటి వరకు పొంగిపొర్లుతున్న వాగులు ఇక ఇప్పుడు శాంతించాయి. ఇలాంటి సమయంలోనే ఇక్కడ ఓ చోట ప్రజలు మాత్రం వజ్రాల వేట ప్రారంభించారు.


 అది ఎక్కడో కాదు నల్లమలలోని మహానంది మండలం సర్వ నరసింహస్వామి ఆలయం సమీపంలో. అక్కడ వక్కి లేరు వాగు ఉంది. అయితే వర్షాలకు ప్రవహిస్తూ ఉంది. ఈ క్రమంలోనే వాగులో వజ్రాలు కొట్టుకొని వస్తాయని ఎన్నో ఏళ్ల నుంచి ప్రచారం ఉంది. అందుకే ఇటీవలి వర్షాలకు వాగు పారింది అన్న  విషయం తెలిసిందో లేదో ఇక తెలుగు రాష్ట్రాల నుంచి వందలాది మంది వాహనాల్లో అక్కడికి చేరుకుంటున్నారు. వాగు వెంట వజ్రాల వేట సాగిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఈ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది అని చెప్పాలి.


 కుటుంబం తో సహా అక్కడ వాగుకు చేరుకొని సూర్యోదయం నుంచి సూర్యా స్తమయం వరకు వజ్రాల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఒక వజ్రం దొరికిన చాలు అనే ఆశతో చివరికి నిరీక్షణ గా  చూస్తూ ఉండడం గమనార్హం. కర్నూలు నంద్యాల జిల్లాల నుంచే కాదు గుంటూరు వైజాగ్ ప్రకాశం కృష్ణా కడప అనంతపురం జిల్లాల నుంచి తెలంగాణ జిల్లాల నుంచి కూడా అక్కడికి ఎంతోమంది వచ్చి వజ్రాల వేట కొనసాగిస్తున్నారు అనేది తెలుస్తుంది. నరసింహ స్వామి ఆలయం పరిసరాల్లో ఉన్న మండపాలలో తలదాచుకుని ఇక మళ్లీ ఉదయాన్నే వజ్రాల అన్వేషణ కొనసాగిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: