ప్రముఖ బ్యాంకులు ఇప్పుడు వరుస పెట్టి షాక్ లు ఇస్తున్నాయి.ఇప్పటివరకు ఎన్నో బ్యాంకులు షాక్ ఇచ్చాయి.వడ్డీ రేట్లను అమాంతం పెంచేసింది..అయితే ఇప్పుడు మరో బ్యాంక్ కూడా ఇదే దారిలో పయనించింది. రుణ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ బ్యాంక్ కస్టమర్లపై ఎఫెక్ట్ పడనుంది. లోన్ తీసుకున్న వారిపై, అలాగే లోన్ తీసుకోవాలని భావించే వారిపై ప్రతికూల ప్రభావం ఉండనుంది.ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన ఫెడరల్ బ్యాంక్ కూడా తాజాగా రుణ రేట్లు పెంచేసింది. ఈ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది.


బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) రేటు పెంపును గమనిస్తే.. ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 8.45 శాతానికి చేరింది.నెల రోజుల ఎంసీఎల్ఆర్ 8.5 శాతానికి ఎగసింది. అలాగే మూడు నెలల ఎంసీఎల్ఆర్ 8.55 శాతానికి పెరిగింది. ఇంకా ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 8.65 శాతంగా ఉంది. ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 8.7 శాతానికి చేరింది. బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటు పెంపు నిర్ణయం అక్టోబర్ 16 నుంచే అమలులోకి వచ్చింది.బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇప్పటికే బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న వారిపై ఈఎంఐ భారం పెరిగే అవకాశం ఉంటుంది. రీసెట్ డేట్ నుంచి ఈఎంఐ పైకి చేరొచ్చు.


ఇది ఇలా ఉండగా కొత్త లోన్ తీసుకోవాలని చూస్తే.. అధిక వడ్డీ రేటు చెల్లించుకోవాల్సి వస్తుంది. అందువల్ల రుణ గ్రహీతలపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు. ఎంసీఎల్ఆర్ రేటు ఆధారిత రుణాలు తీసుకున్న వారిపైనే ప్రభావం పడుతుందని తెలుస్తుంది..గత కొన్ని నెలలుగా రెపో రేటుపు పెంచుకుంటూనే వస్తోంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలనే లక్ష్యంతో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల బ్యాంకులు కూడా రుణ రేట్లు పెంచుకుంటూ వస్తున్నాయి. దీంతో రుణ గ్రహీతలపై ప్రభావం పడుతోంది. దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటివి కూడా రుణ రేట్లు పెంచేశాయి. కాగా రానున్న రోజుల్లో రెపో రేటు మరింత పెరిగే ఛాన్స్ ఉందని తెలుస్తుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: