స్ధాయికి మించి ఓవర్ యాక్షన్ చేస్తే రిజల్టు ఇలాగే ఉంటుందనేందుకు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఓటమే తాజా ఉదాహరణ. తమకు పీసీసీ అద్యక్షపదవి రాలేదన్న కోపాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి మీద చూపించారు. రేవంత్ పై తమలో పేరుకుపోయిన అక్కసుతో మునుగోడు ఎంఎల్ఏ  రాజగోపాలరెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దాని ఫలితమే ఇప్పటి ఉపఎన్నికలు. హోరాహోరీగా జరిగిన ఎన్నికలో   రాజగోపాలరెడ్డి ఓడిపోయారు.





రాజగోపాలరెడ్డి ఓడిపోవటాన్ని చాలామంది హ్యపీగా ఫీలవుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ లో ఉన్నపుడు, బీజేపీలో చేరి కమలం తరపున నామినేషన్ వేసినపుడు రాజగోపాలరెడ్డి మిడిసిపాటును తట్టుకోలేకపోయారు. పార్టీలు తమకు ఒక లెక్కేకాదని తాము ఏ పార్టీలో ఉన్నా గెలుపు తమదే అంటు చిటికెలు వేసి మరీ చాలెంజులు చేశారు. రు. 18 వేల కోట్ల బొగ్గు కాంట్రాక్టుల కోసమే కాంగ్రెస్ నుండి రాజగోపాల్ బీజేపీలో చేరారనే విషయం నియోజకవర్గంలో జనాలందరికీ బాగా అర్ధమైపోయింది.





నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం ఏనాడు కేసీయార్ తో పోరాటంచేయని వ్యక్తి బొగ్గు కాంట్రాక్టు కోసమే ఎంఎల్ఏ పదవికి రాజీనామాచేసి పార్టీమారారన్న విషయం బయటపడటంతో జనాలందరికీ మండిపోయింది. అందుకనే చెప్పిమరీ ఓడగొట్టారు.  కేవలం తన అహంకారం వల్లే రాజగోపాల్ ఉపఎన్నికలో ఓడిపోయారు. బీజేపీకి అయినా ఆలోచన ఎందుకు లేకపోయిందో అర్దంకావటంలేదు. స్ట్రైట్ ఫైట్ జరిగిన చోట్ల బీజేపీ గెలిచినా త్రిముఖ పోటీ జరిగిన చోట ఓడిపోయిన విషయం మరచిపోయింది.






మునుగోడులో బీజేపీతో పాటు టీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా గెలుపుకోసం గట్టిగా కష్టపడ్డాయి. అయితే టీఆర్ఎస్-బీజేపీ పోటీని కాంగ్రెస్ తట్టుకోలేక చేతులెత్తేసింది. కేసీయార్ ఎలక్షనీరింగ్ ముందు బీజేపీ లేదా రాజగోపాల్ నిలబడలేకపోయారు. అధికారంలో ఉండటం టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డికి కలిసొచ్చింది. రాజగోపాల్ ఓడిపోయినా కూసుకుంట్లకు గట్టిపోటీనే ఇచ్చారు. నిజానికి కాంగ్రెస్ లేదా జనాలు కోరుకున్న ఉపఎన్నిక కాదిది. కేవలం రాజగోపాలరెడ్డి అహంకారం, ఓవర్ యాక్షన్ వల్ల జరిగిన ఉపఎన్నికిది. అందుకనే జనాలు కూడా ఓవర్ యాక్షన్ కు తగిన బుద్ధిచెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: