ఏపీలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే..ఇప్పటికే కురిసిన వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో నీళ్ళు పొర్లి పొంగుతున్నాయి..ఎక్కడ చూసినా కూడా చెరువులు తలపిస్తున్నాయి.. ఆ వర్షాల నుంచి ఇప్పటికీ తెరుకొలెదు.. కానీ,మరో బాంబ్ ను పేల్చారు వాతావరణ శాఖ..ఇప్పుడు ఇంకా వర్షాలు కొనసాగనున్నాయని సమాచారం.. అల్పపీడన ప్రాంతంతో సంబంధం ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి ఒక ద్రోణి కేరళ తీరానికి ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ & 3.1 కి.మీ మధ్య కొనసాగుతుంది..అంతేకాదు నవంబర్ 16 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం & పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి.



రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలులో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాంలో  ఈరోజు వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీయవచ్చును .రేపు, ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది..దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది . ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీయవచ్చును.రేపు, ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.



రాయలసీమలో  ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది .రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.ప్రజలు అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: