రాజధాని అమరావతిపై విచారణ సందర్భంగా సుప్రింకోర్టు చేసిన వ్యాఖ్యలను ఎవరికి వారుగా తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి హైకోర్టు తీర్పులోని  కొన్ని అంశాలను సుప్రింకోర్టు తీవ్రంగా వ్యతిరేకించింది. వ్యతిరేకించటమంటే హైకోర్టు తీర్పులోని కొన్ని అంశాలపై సుప్రింకోర్టు కొంత ఆశ్చర్యాన్ని, ఇంకొంత అసహనాన్ని, మరికొంత ఆక్షేపణను వ్యక్తంచేసింది. విచారణ సందర్భంగా చేసిన చేసిన వ్యాఖ్యలపై ఒకవైపు మంత్రులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు ఎల్లోమీడియా ఆనందాన్ని వ్యక్తంచేసింది.





ఒకవైపు మంత్రులు మరోవైపు ఎల్లోమీడియా ఇంత హడావుడి చేస్తుంటే  చంద్రబాబునాయుడుతో పాటు ప్రతిపక్ష నేతలెవరూ నోరిప్పలేదు. ఆరుమాసాల్లో రాజధానిని నిర్మించేయాలన్న హైకోర్టు ఆదేశాలను సుప్రింకోర్టు తీవ్రంగా తప్పుపట్టి స్టే ఇచ్చింది. అలాగే రాజధానిని నిర్మించే హక్కు, అభివృద్ధి చేయటం పూర్తిగా ప్రభుత్వ బాధ్యతని తేల్చేసింది. ఈ విషయంలో హైకోర్టు పరిధి దాటి వ్యవహరించిందని ఆక్షేపించింది. మొత్తం అభివృద్ధినంతా ఒకేచోట కేంద్రీకరించాలా అంటు నిలదీసింది. సో ఈ వ్యాఖ్యల పట్ల మంత్రులంతా హ్యాపీగా ఉన్నారు.





ఇక ఎల్లోమీడియా విషయానికి వస్తే భూసమీకరణ అంశం, సీఆర్డీయే చట్టబద్దత తదితర అంశాలపై ప్రభుత్వాన్ని సుప్రింకోర్టు నిలదీయటాన్ని బాగా హైలైట్ చేస్తోంది. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పునే ఎల్లోమీడియా ప్రస్తావిస్తు దానికే సుప్రింకోర్టు కూడా మద్దతుగా నిలబడిందని చెప్పుకుంటోంది. అంటే సుప్రింకోర్టు వ్యాఖ్యలను ఇటు ప్రభుత్వం అటు ఎల్లోమీడియా ఎవరికి కావాల్సినట్లుగా వాళ్ళు అన్వయించుకుంటున్నారు. ఇదేమీ అంతిమ తీర్పు కాకపోయినా రెండువర్గాలు నానా రచ్చ చేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.





ఇక్కడే ప్రజాకోర్టు విషయం చర్చకు వస్తోంది. అంతిమతీర్పు ఎప్పుడు వస్తుందో ఎవరూ చెప్పలేరు. అందుకనే 2024 ఎన్నికల్లో ప్రజలు ఎవరికి మద్దతిస్తారనేది కీలకమైపోయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డే అధికారంలోకి వస్తే కచ్చితంగా మూడు రాజదానులు ఏర్పడతాయనటంలో సందేహంలేదు. ఇదే సమయంలో జగన్ ఓడిపోతే అమరావతిని తరలించటం దాదాపు కష్టమనే అనుకోవాలి. ఇదే విషయమై యావత్ ఎల్లోబ్యాచ్ ఫుల్లుగా టెన్షన్ పడుతోంది. ఈలోగా సుప్రింకోర్టు గనుక స్పష్టంగా తీర్పు చెప్పేస్తే అప్పుడు ఏమవుతుందో చూడాలి.






మరింత సమాచారం తెలుసుకోండి: