ఏపీ సర్కార్ ఎప్పటికప్పుడు కొత్త పథకాలను అందిస్తుంది.అంతే కాదు.. ప్రజల ఆరోగ్యం పై కూడా కీలక నిర్ణయాలను తీసుకుంటూ వస్తుంది.ఈ మేరకు ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ ఉత్పత్తులపై భారీగా జరిమానాలు విధించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనల్లో సవరణలు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.పర్యావరణాన్ని కాలుష్యం చేసే వారే అందుకు శిక్ష అనుభవించాలని తెలిపింది.


ఈ క్రమంలోనే భారీగా జరిమానాలు విధించాలని ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుగుణంగా జరిమానాలు వేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాలిథిన్ క్యారీ బ్యాగుల ఉత్పత్తి, విక్రయాలు.. ఈ కామర్స్ కంపెనీలపైన దృష్టి పెట్టాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టిక్ వినియోగంపై పట్టమ, గ్రామీణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ శాఖ అధికారులు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది దృష్టి సారించాలని స్పష్టం చేసింది..


నిషేధించిన ప్లాస్టిక్ ఉత్పత్తుల దిగుమతి, తయారీపై తొలిసారి తప్పుగా పరిగణిస్తే... రూ.50 వేలు, రెండోసారి లక్ష రూపాయలు జరిమానా విధించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ ఉత్పత్తులను స్టాక్ చేసినా, పంపిణీ చేసినా డిస్ట్రిబ్యూటర్ స్థాయిలో రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధిస్తారు. దీంతో పాటు సీజ్ చేసిన ఉత్పత్తులపై కిలోకు పది రూపాయల చొప్పున జరిమానా వేయనున్నారు. వీధి వ్యాపారులు ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను వినియోగిస్తే.... 2500 రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు జరిమానా విధించాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. దుకాణాలు, సంస్థలు, మాల్స్ తదితర ప్రదేశాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులు విక్రయిస్తే.. 20 వేల రూపాయల నుంచి 40 వేల రూపాయల వరకు జరిమానా విధించనున్నారు..ప్లాస్టిక్‌ వస్తువుల పై ఇలాంటి నిర్ణయం తీసుకుంటేనే మారతారని కొందరు జగన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: