ప్రత్యర్ధుల మీద బురదచల్లటంలో తెలుగుదేశంపార్టీకి మించిన పార్టీ మరోటిలేదు. అధికారంలో ఉంటే ప్రతిపక్షాల మీద బురదచల్లేస్తుంది. ఇదే ఖర్మం జాలక ప్రతిపక్షంలో ఉంటే అధికారపార్టీ మీద 24 గంటలూ 365 రోజులు బురదచల్లేస్తునే ఉంటుంది. టీడీపీ నేతలు చల్లే బురదను తుడుచుకోవటానికే ప్రత్యర్ధులకు జీవితంకాలం పడుతుంది. ఇప్పుడిదంతా ఎందుకంటే రాష్ట్రంలోని వైన్ షాపులు, బార్లలో కనిపిస్తున్న అనేక బ్రాండ్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై చంద్రబాబు అండ్ కో+ఎల్లోమీడియా విపరీతంగా బురద చల్లేస్తోంది.





చంద్రబాబు అండ్ కో  ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్స్ రిజర్వ్, బూంబుం బీర్లు, పవర్ స్టార్ 999, 999 లెజెండ్ లాంటి బ్రాండ్లను పదేపదే చెబుతు విపరీతంగా ఎగతాళి చేస్తున్నారు. అమాయకజనాలు వాటిని చూసి చంద్రబాబు అండ్ కో చెబుతున్నదంతా నిజమే అనుకుంటున్నారు. అయితే అసలు విషయం ఏమిటంటే అధికారంలో నుండి దిగిపోయే ముందు ఈ బ్రాండ్లన్నింటికీ లైసెన్సు ఇచ్చిందే చంద్రబాబు. తన హయాంలో చంద్రబాబు ఐదేళ్ళల్లో 254 బ్రాండ్లకు అనుమతిచ్చారు.





చంద్రబాబు హయాంలో అనుమతి తీసుకున్న బ్రాండ్లన్నీ ఎన్నికలైపోయిన తర్వాత మార్కెట్లోకి వచ్చాయి. జగన్ ప్రభుత్వం హయాంలో మార్కెట్లోకి వచ్చాయి కాబట్టి అవన్నీ జగన్ ప్రభుత్వమే తీసుకొచ్చిందని అనుకుంటున్నారు. చంద్రబాబే చీపు బ్రాండ్లకు అనుమతిచ్చి, చంద్రబాబు ప్రభుత్వమే అన్నీరకాల బ్రాండ్లకు అనుమతిచ్చి ఇపుడు తమకేమీ తెలీదన్నట్లు జగన్ ప్రభుత్వంపై బురదచల్లేస్తోంది.





అంటే అనుమతిలిచ్చిన చంద్రబాబే ఇపుడు వాటిపైన బురదచల్లేస్తున్నారు. నిజంగానే ఇపుడు మార్కెట్లో ఉన్నదంతా చీపు మద్యమైతే మరి అప్పట్లో లైసెన్సులు ఎలాగిచ్చారు ? చంద్రబాబు లైసెన్సులు జారీచేసిన మద్యం చీపుమద్యమైతే మరప్పట్లో ఎల్లోమీడియా ఏమిచేస్తోంది ? మద్యం ఉత్పత్తికి అనుమతిలిచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే తర్వాత సరఫరాకు అనుమతిచ్చిందీ చంద్రబాబు ప్రభుత్వమే. చేసిందంతా చేసేసి తమకేమీ తెలీదన్నట్లుగా జగన్ ప్రభుత్వంపై బురద చల్లేస్తున్నారు. ఈ బురదచల్లుళ్ళకి ఎల్లోమీడియా విపరీతంగా మద్దతిస్తోంది. ఇందుకే ప్రత్యర్ధులపై బురదచల్లటంలో తెలుగుదేశంపార్టీకి మించిన పార్టీ మరోటిలేదని చెప్పేది.





మరింత సమాచారం తెలుసుకోండి: