జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వైఖరి చాలా విచిత్రంగా ఉంది. ఎవరైనా బాధితులను పరామర్శిస్తారు. కానీ పవన్ మాత్రం చంద్రబాబునాయుడును పరామర్శించటమే చాలా ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబు సభల్లో పాల్గొనేందుకు వెళ్ళి కందుకూరులో 8 మంది, గుంటూరులో 3 చనిపోయారు. నాలుగురోజుల వ్యవధిలో 11 మంది చనిపోవటానికి టీడీపీ నిర్వహణలోపమే కారణమని స్పష్టంగా అర్ధమవుతోంది. నిర్వహణలోపాలను సరిదిద్దుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వంపై ఎదరుదాడులకు దిగారు.





దాంతో రోడ్డుషోలు, రోడ్లపై ర్యాలీలు, రోడ్లపై సభలు నిర్వహించటాన్ని నిషేదిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీన్ని చంద్రబాబు, పవన్, వామపక్షాలు వ్యతిరేకిస్తు నానా గోలచేస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిందేమంటే రెండు ఘటనల్లో చనిపోయిన 11 మంది కుటుంబాలను పవన్ పరామర్శించాలి. అలాకాకుండా వాళ్ళు చనిపోవటానికి కారకుడైన, ప్రభుత్వం ఉత్తర్వుల జారీకి కారకుడైన చంద్రబాబును పరామర్శించేకు పవన్ వెళ్ళారు.





బాధితులను కాకుండా కారకులను పరామర్శించటమే పవన్ స్టైలు లాగుంది. ఇక్కడే పవన్ వైఖరిపై అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబు ఏమిచేసినా పవన్ సానుకూలంగానే స్పందిస్తారన్న విషయం లోకానికి అర్ధమైంది. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కరెక్టేఅయినా వ్యతిరేకించటమే టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. జనాలేమో ప్రభుత్వ ఉత్తర్వులకు సానుకూలంగా స్పందిస్తుంటే చంద్రబాబుకు మద్దతుగా పవన్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. పవన్ వైఖరి ఎందుకని ఇలాగ మారిపోయిందో ఎవరికీ అర్ధంకావటంలేదు.





మొత్తానికి బాధితులకు వ్యతిరేకంగా వ్యవహరించటమే తన ఉద్దేశ్యమని పవన్ చాటిచెప్పినట్లయ్యింది. రెండు ఘటనల సందర్భంగా పవన్ జారీచేసిన ప్రెస్ నోటే దీనికి ఉదాహరణగా నిలిచింది. సదరు ప్రెస్ రిలీజ్ లో ఎక్కడ కూడా ఘటనలపై విచారణ చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పవన్ ఎక్కడా డిమాండ్ చేయలేదు. తన డిమాండ్ వల్ల చంద్రబాబుకు ఎక్కడ ఇబ్బందులు కలుగుతుందో అన్న ఆందోళనే పవన్ ప్రెస్ రిలీజ్ లో కనబడింది. దీంతోనే చంద్రబాబు ప్రయోజనాలకోసమే పవన్ పనిచేస్తున్నారని అందరికీ అర్దమైంది. పవన్ వైఖరి రాబోయే ఎన్నికల్లో జనసేనకు బాగా నష్టం చేస్తుందనే అందరు అనుకుంటున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: